Telugu News » Blog » PRABHAS :త్వ‌ర‌లో బాహుబ‌లి-3….క్లారిటీ ఇచ్చిన ప్ర‌భాస్ ..!

PRABHAS :త్వ‌ర‌లో బాహుబ‌లి-3….క్లారిటీ ఇచ్చిన ప్ర‌భాస్ ..!

by AJAY

తెలుగు చిత్ర‌ప‌రిశ్ర‌మ‌కు దేశ‌వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన సినిమా బాహుబలి. ఈ సినిమాలో ప్ర‌భాస్ హీరోగా న‌టించగా రాజ‌మౌళి ద‌ర్శ‌కత్వం వ‌హించారు. ఈ చిత్రాన్ని బాహుబ‌లి పార్ట్ వ‌న్, పార్ట్ టూ లుగా తెర‌కెక్కించారు. ఈ సినిమా ఎలాంటి రికార్డులు సృష్టించిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అయితే బాహుబ‌లి సిరీస్ కంటిన్యూ అవుతుంద‌ని ఇటీవ‌ల రాజ‌మౌళి తండ్రి ఈ సినిమా ర‌చ‌యిత విజ‌యేంద్రప్ర‌సాద్ ఓ ఇంటర్వ్యూలో వెల్ల‌డించారు.

Advertisement

prabhas rajamouli

prabhas rajamouli

దాంతో బాహుబ‌లి 3 ఉండ‌బోతుంద‌ని వార్త‌లు గుప్పుమ‌న్నాయి. అయితే ఇదే అంశంపై హీరో ప్ర‌భాస్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ రాధే శ్యామ్ ప్ర‌మోష‌నల్ కార్య‌క్ర‌మాల‌లో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా ప్ర‌భాస్ ఓ ఇంటర్వ్యూకు వెళ్లారు. మ‌ళ్లీ రాజ‌మౌళితో సినిమా ఉంటుందా అని యాంక‌ర్ ప్ర‌శ్నించారు. దానికి ప్ర‌భాస్ తాను రాజ‌మౌళి మంచి ఫ్రెండ్స్ అని చెప్పాడు.

Advertisement

prabhas

prabhas

తాము త‌ర‌చూ సినిమాల గురించి మాట్లాడుకుంటామ‌ని ప్ర‌భాస్ అన్నారు. ఏదో ఒక‌టి ఖ‌చ్చితంగా ఉంటుంద‌ని ప్ర‌భాస్ అన్నారు. అంతే కాకుండా తాను రాజ‌మౌళి బాహుబ‌లి సినిమాను ఎప్పుడూ విడిచిపెట్ట‌మ‌ని ప్ర‌భాస్ వ్యాఖ్యానించారు. ఎవ‌రికి తెలుసు ఏమైనా జ‌ర‌గ‌వ‌చ్చు…అంటూ కామెంట్లు చేశాడు. ఇక ప్ర‌భాస్ చేసిన కామెంట్స్ తో బాహుబ‌లి పార్ట్ -3 త్వ‌ర‌లోనే ఉండ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది.