సీరియల్స్ కు దాదాపుగా సినిమాలకు ఉన్నంత క్రేజ్ ఉంటుంది. మహిళలు అయితే సూపర్ హిట్ సినిమా టీవీలో వస్తున్నా…క్రికెట్ మ్యాచ్ వస్తున్నా అవి పక్కన పెట్టేసి డైలీ సీరియల్స్ నే చూస్తుంటారు. సీరియల్స్ కోసం ఇళ్లలో యుద్దాలు కూడా జరుగుతాయన్నది జగమెరిగిన సత్యం. ఇక సీరియల్స్ ను కూడా నిర్మాతలు తక్కువు బడ్జెట్ తో తెరకెక్కించలేరు. సీరియల్ తీయాలన్నా బడ్జెట్ ఎక్కువే అవుంతున్న సంగతి చూస్తేనే అర్థం అయిపోతుంది. సీరియల్స్ లో ఉండే భారీ బంగళాలు కాస్లీ కారులు కావాలంటే ఎక్కువే ఖర్చు చేయాలి.
ALSO READ : 2001 సంక్రాంతి ఫైట్…చిరు,వెంకటేష్ లను కోలుకోలేని దెబ్బకొట్టిన బాలయ్య..!
Advertisement
ఇదిలా ఉంటే సినిమాల్లో కంటే సీరియల్స్ లోనే ఎక్కువ కాస్ట్యూమ్ లు కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా మహిళలు అయితే సీరియల్స్ లోనే ఎక్కువ కలర్ ఫుల్ గా కనిపిస్తూ ఉంటారు. సీన్ ఏదైనా సంధర్భం ఏదైనా ఖరీదైన నగలు కాస్ట్లీ చీరలు కట్టకుని కనిపిస్తూ ఉంటారు. సీరియల్ లో రాత్రి సీన్ జరుగుతున్నా సరే అందులో నటీమనులు మాత్రం మేకప్ తో పట్టు చీరల్లో కనిపిస్తుంటారు. నైట్ డ్రెస్ ఉంటాయన్న లాజిక్ ను కూడా పక్కన పెట్టేస్తారు.
Advertisement
ALSO READ : KHILADI REVIEW : రవితేజ ఖిలాడీ రివ్వ్యూ…బొమ్మ హిట్టా ఫట్టా !
అదే సీరియల్స్ మ్యాజిక్కు….ఇదిలా ఉంటే అసలు సీరియల్స్ లో నటించడానికి నటీమణులకు ఈ చీరలు ఎక్కడ నుండి వస్తున్నాయి. వాళ్ల సొంత చీరలేనా…లేదంటే సీరియల్ తెరకెక్కిస్తున్న వాళ్లే ఇస్తున్నారా ఇలా రకరకాల అనుమానాలు ఉంటాయి. అయితే ఇప్పుడు ఆ డౌట్ ను క్లియర్ చేసుకుందాం. నిజానికి సీరియల్స్ లో నటించే నటీనటులు కొన్ని సార్లు సొంత కాస్ట్యూమ్ లలో కూడా షూటింగ్ పూర్తి చేసుకుంటారు.
Also Read: గ్యాస్ సిలిండర్ పేలితే 50లక్షలు…! ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిన 10 హక్కులు ఇవే..!
కానీ ఎక్కువ శాతం ప్రొడక్షన్ వాళ్లే చీరలు ఇతర కాస్ట్యూమ్ లను ఇస్తారు. ఇక వేలకు పైగా రోజులు సీరియల్స్ రన్ అవుతాయి కాబట్టి ఎలాంటి డౌట్ రాకుండా నెలరోజులకొకసారి చీరలను మార్చి మార్చి కడుతుంటారు. అలా అయితే సీరియల్స్ చూస్తున్న వాళ్లు కూడా చీరను గుర్తుపట్టలేరు కాబట్టి.