Home » దాక్షాయ‌ని త‌మ్ముడు మొగిలీస్ ఎవ‌రో తెలుసా…?సుకుమార్ కు ఏమ‌వుతాడంటే..!

దాక్షాయ‌ని త‌మ్ముడు మొగిలీస్ ఎవ‌రో తెలుసా…?సుకుమార్ కు ఏమ‌వుతాడంటే..!

by AJAY
Ad

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన రీసెంట్ బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా పుష్ప‌. ఈ సినిమాను సుకుమార్ రెండు పార్టులుగా తెర‌కెక్కించ‌గా ఫ‌స్ట్ పార్ట్ పుష్ప ది రైస్ ను పాన్ ఇండియా లెవ‌ల్ లో విడుద‌ల చేశారు. ఇక స‌ర్వ‌త్రా పాజిటివ్ రెస్పాన్స్ వ‌చ్చిన ఈ సినిమాకు క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురుస్తోంది. క‌రోనా ఆంక్ష‌ల నేప‌థ్యంలో కూడా ఈ సినిమా భారీ క‌లెక్ష‌న్లను రాబ‌ట్టింది. ఈ సినిమాలో పుష్ప‌రాజ్ కు హీరోయిన్ గా ర‌ష్మిక మంద‌న న‌టించింది.

Advertisement

ఇక ఈ సినిమాలో భారీ తారాగ‌ణం న‌టించగా ప్ర‌తి ఒక్క‌రూ త‌మ త‌మ న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నారు. ఈ చిత్రంలో అన‌సూయ‌, ఫ‌హ‌ద్ ఫాజిల్, సునీల్, రావురమేష్ ముఖ్య‌మైన పాత్ర‌ల్లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. అంతే కాకుండా అల్లు అర్జున్ కు స్నేహితుడిగా న‌టించిన కేశ‌వ మ‌రియు అన‌సూయకు తమ్మ‌డిగా నటించిన న‌టుడు కూడా న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నారు.

Advertisement

ఈ చిత్రంలో అన‌సూయ‌కు సోద‌రుడిగా మెగిలీస్ పాత్ర‌లో న‌టించిన న‌టుడి పేరు రాజ్ తిరంద‌సు. మెగిలీస్ పాత్ర‌లో ఈ న‌టుడు ఒదిగిపోయాడు. బ్లేడ్ నోట్లో పెట్టుకుని త‌న విల‌నిజం తో ఆక‌ట్టుకున్నాడు. భ‌య‌ప‌డుతున్నాడు భ‌య‌ప‌డుతున్నాడు అంటూ సైకోలా న‌టించిన తీరు ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంది.

రాజ్ తిరంద‌సు కొత్త పోర‌డు అనే వెబ్ సిరీస్ లో న‌టించి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ వెబ్ సిరీస్ సుకుమార్ చూసి అత‌డికి పుష్ప సినిమాలో అవ‌కాశం క‌ల్పించిన‌ట్టు తెలుస్తోంది. అంతే కాకుండా రాజ్ తిరంద‌సు నిఖిల్ అనుప‌మ జంట‌గా న‌టిస్తున్న 18 పేజీస్ సినిమాలోనూ న‌టిస్తున్నాడు. ఈ సినిమాను కూడా సుకుమార్ నిర్మిస్తున్నారు.

Visitors Are Also Reading