ప్రస్తుతం టాలీవుడ్ లో నటి పవిత్ర లోకేష్ నటుడు నరేష్ ల పెళ్లి వార్తలు హాట్ టాపిక్ గా మారాయి. వీరిద్దరూ గత కొంతకాలంగా కలిసే ఉంటున్నారని అంతే కాకుండా త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కొద్దిరోజులుగా వార్తలు ప్రచారం అవుతున్నా అటు నరేష్ ఇటు పవిత్ర లోకేష్ ఆ వార్తలను ఖండించలేదు. మరోవైపు వీరిద్దరూ కలిసి మహాబలేశ్వరంలో ఓ స్వామి వద్ద ఆశీర్వాదాలు తీసుకుంటున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
Advertisement
ఇదిలా ఉంటే నరేష్ మూడు పెళ్లిళ్ల గురించి అతడి బ్యాంగ్రౌండ్ గురించి చాలా మందికి తెలుసు కానీ పవిత్ర లోకేష్ మొదటి భర్త గురించి అతికొద్దిమందికే తెలుసు దాంతో అతడి గురించి నెటిజన్లు ఆరాతీయడం మొదలుపెట్టారు. పవిత్ర లోకేష్ మొదటి భర్త భర్త పేరు సుచేంద్ర ప్రసాద్ కాగా వీరిద్దరూ 2007లో వివాహం చేసుకున్నారు. మరోవైపు సుచేంద్ర ప్రసాద్ కు కూడా అప్పటికే వివాహం జరిగింది. పవిత్ర లోకేష్ కంటే ముందు ఆయన మల్లికను వివాహం చేసుకున్నారు.
Advertisement
2007లో మొదటి భార్యతో విడాకులు తీసుకున్న సుచేంద్రప్రసాద్ పవిత్రలోకేష్ ను అదే ఏడాది వివాహం చేసుకున్నాడు. ఆ తరవాత ఆమెతో కూడా దూరంగా ఉంటున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక పవిత్ర లోకేష్ కు కూతురు, కొడుకు ఉన్నారు. ఇప్పటికే పవిత్ర లోకేష్ 300 లకు పైగా సినిమాల్లో నటించి అలరించారు.
ప్రస్తుతం పవిత్ర అమ్మ, అత్త లాంటి క్యారెక్టర్ లు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. శర్వానంద్ హీరోగా నటించిన మల్లిమల్లి ఇది రాని రోజు సినిమాలో పవిత్ర శర్వాకు తల్లిగా నటించి మెప్పించారు. అంతే కాకుండా టెంపర్, బెంగాల్ టైగర్ సినిమాల్లోనూ తన నటనతో మెప్పించారు. అయితే నరేష్ తో పెళ్లి నిజమానే గాలి వార్తలేనా అన్నది తెలియాలంటే మాత్రం వెయిట్ చేయాల్సిందే.
ALSO READ : వామ్మో ఫస్ట్ లుక్ చూసి కేక అనుకున్నాం..కానీ ఆ రెండు సినిమాల కాపీ నా ఇది ?