సినిమా ఇండస్ట్రీ గర్వించ దగ్గ నటుడు ఎన్టీ రామారావు పౌరాణిక జానపద చిత్రాల్లో ఎన్టీ రామారావు తనకంటూ చెరగని ముద్ర వేసుకున్నారు. రాముడు, కృష్ణుడు లాంటి పాత్రలలో నటించి ప్రేక్షకుల హృదయాలలో నిలిచిపోయారు. అంతేకాకుండా కమర్షియల్ సినిమాలతోను ఎన్టీఆర్ సక్సెస్ ను అందుకున్నారు. స్టార్ హీరోగా గొప్ప నటుడిగా పేరు సంపాదించుకున్నారు. సినిమాల్లో ఏ విధంగా సక్సెస్ అయ్యారో ఎన్టీరామారావు రాజకీయాల్లోనూ అదే స్థాయిలో సక్సెస్ ని చూశారు.
తెలుగునాట పార్టీని స్థాపించి ప్రాంతీయ పార్టీతో సంచలనాలు సృష్టించారు…. ఢిల్లీ పీఠాన్ని కదిలించారు. ముఖ్యమంత్రిగా ఎన్నో అద్భుతమైన పథకాలను తీసుకువచ్చి పేదలకు అండగా నిలిచారు. అయితే ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి రావడం వెనక ఒక కారణం ఉంది. ఎన్టీఆర్ సర్ధార్ పాపారాయుడు సినిమా చేస్తున్న సమయంలో ఆయనకు సమాజ సేవ చేయాలనే ఆలోచన కలిగిందట.
Advertisement
Advertisement
నా దేశం, బొబ్బిలి పులి సినిమాలు ఆయనకు కూడా రాజకీయాల్లోకి రావాలనే కోరికను పెంచాయట. సర్దార్ పాపారాయుడు సినిమాలో అల్లూరి సీతారామరాజు వేషధారణలో ఉండగానే ఆయనలో ప్రజా సేవ చేయాలనే కోరిక బలంగా నాటుకుపోయింది. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఆ తర్వాత ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.
రాజకీయాల్లో…హెలో బ్రదర్, అమ్మా అక్కా చెల్లి తమ్ముడూ అని ప్రేమతో పిలుస్తూ ఆయన చేసిన ప్రసంగాలతో ప్రజలను తనవైపు తిప్పుకున్నారు. ఎన్టీఆర్ ఏ ప్రాంతానికి వెళ్లినా లక్షల్లో ప్రజలు వచ్చేవారు. ఆయన స్పీచ్ వినేందుకు గ్రామాలు గ్రామాలు తరలి వచ్చేవి. ఇక సినిమా హీరోలు ఎందరో వస్తుంటారు పోతుంటారు. కానీ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రిగా సేవలందించి రియల్ హీరోగా పేరు సంపాదించుకున్నారు. ఇప్పటికీ ప్రజలకు గుర్తుండిపోయారు.
Also read :
సర్కారు వారి పాట సినిమాలో భీమ్లా నాయక్ రింగ్ టోన్ వెనక ఇంత కథ ఉందా…!
ఇప్పటికీ మీతోనే అన్నా అంటూ సీఎం జగన్ పాత ఫోటో షేర్ చేసిన శ్రీరెడ్డి…నెట్టింట వైరల్…!