Home » జబర్దస్త్ లేడీ కమెడియన్ పవిత్ర ఎవరో తెలుసా..! ఇంతకుముందు ఏం చేసేదంటే..!

జబర్దస్త్ లేడీ కమెడియన్ పవిత్ర ఎవరో తెలుసా..! ఇంతకుముందు ఏం చేసేదంటే..!

by AJAY
Ad

కామెడీ షో అంటే ముందుగా గుర్తుకు వచ్చేది జబర్దస్త్. ఇప్పటివరకు ఎన్నో కామెడీ షోలు వచ్చాయి కానీ జబర్దస్త్ కు వచ్చిన క్రేజ్ ఏ షోకు కూడా రాలేదు. జబర్దస్త్ లో అవకాశం వచ్చిందంటే లైఫ్ సెట్ అయినట్టే అని కూడా చాలా మంది అప్ కమింగ్ కమెడియన్స్ అనుకుంటారు. మొదట్లో ధన్ రాజ్, వేణు లాంటి కమెడియన్స్ కూడా జబర్దస్త్ లో చేశారు.

Jabardast pavitra

Jabardast pavitra

అయితే ప్రస్తుతం సినిమాలతో బిజీ అవ్వడం వల్ల జబర్దస్త్ కు దూరం అయ్యారు. జబర్దస్త్ లో ఫేమస్ అయ్యిన చాలా మంది ఇప్పుడు సినిమాల్లో బిజీ అయ్యారు. యాంకర్ అనసూయ కూడా జబర్దస్త్ వల్లనే అంతటి క్రేజ్ ను సంపాదించుకుంది. ఇక ఈ షోలో మొదట్లో మహిళలు స్కిట్స్ చేసేవాళ్ళు లేదంటే ట్రాన్స్ జెండర్ లను లేదా మగవాళ్ళకి ఆడవాళ్ళ వేషాలు వేసేవారు.

Advertisement

Advertisement

కానీ ఇప్పుడు మహిళలకు సైతం స్కిట్ లో అవకాశం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వర్ష లాంటి వాళ్ళు టాలెంట్ ను నిరూపించుకుంటున్నారు. ఇదిలా ఉంటే జబర్ధస్త్ లో రీసెంట్ గా మంచి మార్కులు కొట్టేస్తున్న నటి పవిత్ర.

చూడ్డానికి హైట్ తక్కువగా ఉండే పవిత్ర అదిరిపోయే పంచ్ లతో నవ్విస్తూ ఉంటుంది. బుల్లెట్ భాస్కర్, వెంకీ పవిత్ర హైట్ పైనే పంచ్ లు వేస్తూ కామెడీ పండిస్తున్నారు. నిజానికి పవిత్ర మొదట్లో సీరియల్స్ లో కూడా నటించింది. కానీ సీరియల్స్ లో అంతగా పాపులారిటీ రాలేదు. కానీ జబర్దస్త్ ద్వారా మాత్రం గుర్తింపు తెచ్చుకుంది.

Visitors Are Also Reading