Home » సీత‌క్క అస‌లు పేరేంటి..? ద‌ళంలోకి ఎందుకు వెళ్లిందంటే..!

సీత‌క్క అస‌లు పేరేంటి..? ద‌ళంలోకి ఎందుకు వెళ్లిందంటే..!

by AJAY
Published: Last Updated on
Ad

తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు తెచ్చుకున్న పొలిటిక‌ల్ లీడ‌ర్ల‌లో సీత‌క్క ఒక‌రు. త‌న సేవా కార్య‌క్ర‌మాల ద్వారా సీత‌క్క ప్ర‌జ‌ల అభిమానాన్ని సంపాదించారు. క‌రోనా స‌మ‌యంలో మిగ‌తా నాయ‌కులు బిక్కు బిక్కు మంటూ ఇంట్లో ఉంటే సీత‌క్క మాత్రం త‌న ప్ర‌జ‌ల ఆక‌లి తీర్చేందుకు అడ‌విలోకి వెళ్లి స‌రుకులు అంద‌జేశారు. ఆదివాసీల మంచి చెడ్డా చూసుకున్నారు. అడ‌విలోకి వాహ‌నాలు వెళ్లేందుకు స‌రైన దారి కూడా లేకపోవ‌డంతో కాళిన‌డ‌క ప్రయాణం చేశారు. ఇదిలా ఉంటే సీత‌క్క తాజాగా ఓ ఇంట‌ర్యూలో ఆస‌క్తిక‌ర విష‌యాలు బ‌య‌ట‌పెట్టారు. త‌న‌ అస‌లు పేరు ద‌నుస‌రి అనసూయ అని సీత‌క్క చెప్పారు.

seethakka

seethakka

తాను ద‌ళంలో పనిచేసిన‌ప్పుడు అన్న‌లు సీత‌క్క అని పేరు పెట్టినట్టు చెప్పారు. స‌ర్టిఫికెట్ల‌లో కూడా అదే ఉంద‌ని చెప్పారు. తాను పెళ్లి చేసుకునే వ్య‌క్తి పేరు రాము అని ఉండ‌టంతో ఆయ‌న పేరుతో క‌లిసేలా సీత‌క్క అని పెట్టార‌ని చెప్పారు. రాము ఉద్య‌మ పార్టీలో ద‌ళ‌ క‌మాండ‌ర్ గా ఉండేవార‌ని చెప్పారు. ఆయన ముందు నుండి ద‌ళంలో ఉన్నార‌ని చెప్పారు. తన‌కు ముందు నుండి ద‌ళంలోని వ్య‌క్తులతో ప‌రిచయాలు ఉన్నాయ‌ని చెప్పారు. తాను ఎనిమిదో త‌ర‌గ‌తి లో ఉన్న‌ప్పుడే హాస్ట‌ల్ స‌మస్య‌లపై పోరాటం చేసేదానిని అని చెప్పారు.

Advertisement

Advertisement

also read : మోడీ పొలిటిక‌ల్ కెరీర్ పై వేణుస్వామి జోతిష్యం…బీజేపీ ఫ్యూచ‌ర్ ఎలా ఉంటుందంటే..?

తాను స్కూల్ లో ఉన్న స‌మయంలో వ‌ర‌ద‌లు వ‌స్తే చందాలు వ‌సూలు చేసి ప్ర‌జ‌ల‌కు సాయం చేశామ‌ని చెప్పారు. విద్యార్థి ద‌శ‌లోనే తాను ఉద్య‌మంలో ప‌నిచేన‌ని చెప్పారు. త‌న మేన‌మామ కూడా ద‌ళంలో ప‌నిచేశార‌ని ఆయ‌న నుండే ఆ ల‌క్ష‌ణాలు వ‌చ్చి ఉంటాయ‌ని చెప్పారు. త‌మ కుటుంబం ఆర్థికంగా చాలా వెన‌క‌బ‌డి ఉండేద‌ని చెప్పారు. హాస్ట‌ల్ లో చ‌దువుకున్నానని అప్పుడు ఎదిరించి మాట్లాడేదానిని అని తెలిపారు. తాను గ‌తంలో పాట‌కు కూడా పాడేదానిని అని చెప్పారు. ఊర్లోకి ద‌ళం వ‌చ్చింద‌ని తెలియాలంటే ముందుగా పాట‌లు పాడాల్సివ‌చ్చింద‌ని చెప్పారు.

Visitors Are Also Reading