మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం గాడ్ ఫాదర్. ఆచార్య సినిమా ఫ్లాప్ తరవాత మెగాస్టార్ గాడ్ ఫాదర్ సినిమాతో దసరాకు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సునీల్, సత్యదేవ్, సల్మాన్ ఖాన్ ముఖ్యమైన పాత్రలలో నటించారు. అంతే కాకుండా సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ నయనతార ముఖ్యమైన పాత్రలో నటించింది.
Also Read: ఇక నుంచి కృష్ణతో సినిమాలు తీయకూడదని శోభన్ బాబు ఎందుకు నిర్ణయించుకున్నాడో తెలుసా ?
Advertisement
ఈ సినిమాను మలయాళ సూపర్ హిట్ సినిమా లూసీఫర్ నుండి రీమేక్ చేశారు. లూసీఫర్ పొలిటికల్ డ్రామా కాగా కథ థీమ్ మాత్రమే తీసుకుని కథలో భారీగా మార్పులు చేశారు. లూసీఫర్ కు రీమేక్ అయినప్పటికీ గాడ్ ఫాదర్ సినిమాలో చాలా మార్పులు చేశారు. ఇక ప్రస్తుతం గాడ్ ఫాదర్ సినిమాకు సూపర్ హిట్ టాక్ వస్తోంది. ఇక ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలలో నటించిన వారిలో చిరంజీవి తండ్రి పాత్రలో నటించిన వారి సర్వదామన్ బెనర్జీ కూడా ఒకరు.
Advertisement
ఈ సినిమాలో సర్వదామన్ చిరంజీవికి తండ్రి పాత్రలో నటించారు. సినిమాలో చిరు నయన్ అన్నా చెల్లెల్లుగా నటించగా వారికి తండ్రిగా సర్వదామన్ బెనర్జీ నటించారు.అయితే సర్వదామన్ బెనర్జీ యూత్ కు పెద్దగా తెలియదు కానీ ఆయన ఒకప్పటి హీరో. చాలా సినిమాలలో సర్వదామన్ హీరోగా నటించి మెప్పించారు.
అంతే కాకుండా సర్వదామన్ తెలుగు సినిమాలలోనూ హీరోగా నటించి అభిమానులను సంపాదించుకున్నారు. కే విశ్వనాథ్ దర్శకత్వం లో వచ్చిన సూపర్ హిట్ సినిమా సిరివెన్నెలలో సర్వదామన్ హీరోగా నటించారు. ఆ తరవాత చాలా సినిమాల్లో హీరోగా నటించి మెప్పించాడు. ఇక ఏకంగా 35 ఏళ్ల తరవాత మళ్లీ మెగాస్టార్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. మరి రీఎంట్రీ తరవాత సర్వదామన్ కెరీర్ ఎలా ఉంటుందో చూడాలి.
Also Read: ‘ భైరవద్వీపం ‘ సినిమాకు ఎన్టీఆర్, రజనీకాంత్, చిరంజీవితో ఉన్న లింక్ ఏంటంటే ?