పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన తాజా చిత్రం భీమ్లా నాయక్. ఈ సినిమాలో పలువురు కొత్త వారికి అవకాశం ఇచ్చారు. వారిలో సినిమాలో కీలక సన్నివేశాలలో నటించిన ఓ నటుడి గురించి ఇప్పుడు తెలుసుకుంది. అడవిలో మేకలు కాస్తున్న ఓ గడ్డం ఉన్న వ్యక్తి దగ్గరకు వచ్చిన డానియల్ శేఖర్ రానా భీమ్లానాయక్ ను కొక్కిరి దేవర గా ఎందుకు కొలుస్తారని ప్రశ్నిస్తాడు. దాంతో ఆ వ్యక్తి ఫ్లాష్ బ్యాక్ ను చెబుతాడు.
Advertisement
ఫారెస్ట్ ఆఫీసర్ అడవిలో నివసించే ఆడబిడ్డలను చెరబట్టగా అతడిని అతడితో దౌర్జన్యాలు చేస్తున్న వారిని భీమ్లానాయక్ ఊచకోత కోసి రక్షిస్తాడని చెబుతాడు. అందువల్లే భీమ్లానాయక్ ను కొక్కిరి దేవరగా కొలుస్తారని చెబుతాడు. అంతే కాకుండా ఆ ఫ్లాష్ బ్యాక్ చెప్పిన వ్యక్తే క్లైమాక్స్ లో భీమ్లానాయక్ డానియల్ శేఖర్ ల మధ్య ఫైట్ జరుగుతుండగా భీమ్లా నాయక్ పడిపోతే మళ్లీ అతడిని తిరిగి లేపే వ్యక్తిగా కనిపించాడు.
Advertisement
అలాంటి ముఖ్యమైన పాత్రలో నటించిన వ్యక్తి పేరు ఎం ఎస్ చౌదరి ….కాగా ఆయన నాటకాల్లో నటించి ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు. నాటకాల్లో తన నటనతో ఆకట్టుకుని ఏకంగా 17 నంది అవార్డులను సొంతం చేసుకున్నాడు. రచయితగా దర్శకుడిగా కూడా ఎంఎస్ చౌదరి చేస్తూ నటనలోనూ రానిస్తున్నాడు.
ALSO READ : భీమ్లా నాయక్ థియేటర్ లో ఫ్యాన్స్ తో తమన్ రచ్చ…వీడియో వైరల్…!
ఎంఎస్ రెడ్డి శ్రీకాంత్ కీలక పాత్రలో నటించిన మహాత్మ సినిమాలో విలన్ కొడుకుగా నటించి అలరించాడు. అంతే కాకుండా తేజ దర్శకత్వంలో వచ్చిన నీకునాకు డాష్ డాష్ సినిమాలో కూడా మెయిన్ విలన్ గా నటించి అలరించాడు. మరోవైపు గబ్బర్ సింగ్ మరియు అజ్ఞాత వాసి సినిమాలో కూడా నటించి మెప్పించాడు. దాంతో భీమ్లా నాయక్ లో ఆ పాత్రకు ఎంఎస్ చౌదరి సరిపోతాడని త్రివిక్రమ్ సెలక్ట్ చేశారు.