పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన తాజా సినిమా భీమ్లా నాయక్. ఈ సినిమాలో రానా కూడా కీలక పాత్రలో నటించారు. ఇక ఈ చిత్రానికి సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే అందించారు. సినిమాలో నిత్యామీనన్ పవన్ కు జోడీగా నటించగా…సంయుక్త మీనన్ రానాకు జోడిగా నటించింది. ఇదిలా ఉంటే సాగర్ కే చంద్రకు పవన్ కల్యాణ్ చాన్స్ ఇవ్వడం అందర్నీ ఆశ్చర్యపర్చింది.
ALSO READ : SRI REDDY : భీమ్లా నాయక్ చెత్తగా ఉంది…పవన్ పై శ్రీరెడ్డి ఫైర్..!
Advertisement
బడా దర్శకులు క్యూ కడుతుంటే పవన్ కుర్ర దర్శకుడికి చాన్స్ ఇవ్వడం ఏంటని అనుకున్నారు. నిజానికి సాగర్ కే చంద్ర ఇప్పటికే శ్రీవిష్ణు-నారా రోహిత్ లతో ఒక్కడుండేవాడు అనే సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా అనుకున్నమేర విజయం సాధించలేకపోయింది. కొంతమందిని ఈ సినిమా బాగా ఆకర్షించింది. సుకుమార్, త్రివిక్రమ్ లాంటి దర్శకుడులు ఈ సినిమా చూసి సాగర్ కే చంద్రకు ఫోన్ చేసి మరీ ప్రశంసించారు.
Advertisement
అంతటి టాలెంట్ ఉండటంతోనే పవన్ భీమ్లానాయక్ ఆఫర్ సాగర్ కే చంద్ర వద్దుకు వెళ్లింది. సాగర్ కే చంద్ర నల్గొండ జిల్లాకు చెందిన వాసి కాగా బీటెక్ పూర్తిచేసి అమెరికాలో మాస్టర్స్ పూర్తి చేశారు. సినిమాలపై ఆసక్తి ఉండటంతో అక్కడే సినిమాటోగ్రఫిపై కోర్సు చేశారు. సాగర్ కే చంద్ర తండ్రి నల్గొండలో విద్యాసంస్థల యజమాని కాగా ఆయన తల్లి గృహిణి.
ఇక 2017లో గీతారెడ్డిని వివాహం చేసుకున్నాడు. గీతారెడ్డి కూడా బీటెక్ పూర్తిచేసి అమెరికాలో మాస్టర్స్ చేశారు. ఇదిలా ఉంటే సాగర్ కే చంద్ర ఎక్కువగా పుస్తకాలు చదవడం వల్ల తెలుగు పై పట్టు సాధించారు. ఒకేవేళ దర్శకత్వంలోకి రాకపోయి ఉంటే తాను సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసేవాడినని సాగర్ కే చంద్ర చెప్పారు.