Home » SRI REDDY : భీమ్లా నాయ‌క్ చెత్త‌గా ఉంది…ప‌వ‌న్ పై శ్రీరెడ్డి ఫైర్..!

SRI REDDY : భీమ్లా నాయ‌క్ చెత్త‌గా ఉంది…ప‌వ‌న్ పై శ్రీరెడ్డి ఫైర్..!

by AJAY
Ad

ప‌వ‌ర్ స్టార్ ప‌వన్ క‌ల్యాణ్ హీరోగా న‌టించిన తాజా చిత్రం భీమ్లా నాయ‌క్. ఈ సినిమాకు సాగ‌ర్ కే చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే మ‌రియు మాట‌లు అందించారు. ఇక ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 25న విడుద‌ల కాగా క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురుస్తోంది. థియేటర్ల వద్ద భీమ్లా నాయ‌క్ హ‌వా క‌నిపిస్తోంది. సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండ‌గా ప‌వ‌న్ క‌ల్యాణ్ అంటే గిట్ట‌ని శ్రీరెడ్డి మాత్రం భీమ్లా నాయ‌క్ సినిమాపై మరియు ప‌వ‌న్ క‌ల్యాణ్ పై నిప్పులు చెరిగింది.

Advertisement

నువ్వు సినిమాల‌కు రాజ‌కీయాల‌కు రెండింటికి ప‌నికి రావంటూ శ్రీరెడ్డి ప‌వ‌న్ క‌ల్యాణ్ పై ఫైర్ అయ్యింది. మొద‌టి రోజే హ‌డావుడి రెండో రోజు నీ సినిమా చూసేవాళ్లు క‌రువు అంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. అంతే కాకుండా భీమ్లా నాయ‌క్ సినిమా చెత్త‌గా ఉంద‌ని రాజ‌కీయ ల‌బ్ది కోస‌మే ప‌వ‌న్ క‌ల్యాణ్ ఈ సినిమాను చేసాడని శ్రీరెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

Advertisement

Srireddy

Srireddy

సినిమా కోసం కేటీఆర్ సంక ఎందుకు నాకావు అంటూ షాకింగ్ కామెంట్లు చేసింది. నువ్వు వ్య‌క్తిగ‌త ల‌బ్దికోసం కేటీఆర్ ను తెలంగాణ ప్ర‌భుత్వం వ‌ద్ద‌కు వెళ్ల‌వ‌చ్చు కానీ మెగాస్టార్ చిరంజీవి ఏపీ సీఎం జ‌గ‌న్ వ‌ద్ద‌కు వెళ్ల‌కూడ‌దా అంటూ ప్ర‌శ్నించింది. నువ్వు ఎన్ని నాట‌కాలు ఆడినా సీఎం కాలేవు అంటూ శ్రీరెడ్డి ఫైర్ అయ్యింది. ఇక శ్రీరెడ్డి చేసిన కామెంట్ల‌తో ప‌వ‌న్ అభిమానులు ఆమెపై మండిప‌డుతున్నారు. ద‌మ్ముంటే ఇక్క‌డికి వ‌చ్చి మాట్లాడు అంటూ శ్రీరెడ్డికి స‌వాల్ విసురుతున్నారు.

Visitors Are Also Reading