అక్కినేని కుటుంబం నుండి ఓ అమ్మాయి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ విషయం చాలా మందికి తెలియదు. నిజానికి కొన్ని సినిమాలు చేసుంటే ప్రేక్షకులు గుర్తుపట్టేవారేమో కానీ ఒక్క సినిమాతోనే పులిస్టాప్ పెట్టేసింది. ఆ అమ్మాయి మరెవరో కాదు. అక్కినేని నాగేశ్వరరావు పెద్ద కుమార్తె, నాగ్ సోదరి యార్లగడ్డ సత్యవతి కూతురు యార్లగడ్డ సుప్రియ….ఈమె సోదరుడే సుమంత్. అంతే కాకుండా సుమంత్ సుప్రియల తండ్రి యార్లగడ్డ సురేంద్ర ఒకప్పుడు బడా ప్రొడ్యూసర్ ఆయన ఎన్నో సినిమాలను నిర్మించారు.
Advertisement
ఇదిలా ఉంటే యవ్వనంలోనే సుప్రియ తన తల్లిని కోల్పోంది. దాంతో సుప్రియ, సుమంత్ బాధ్యతలను తాత అమ్మమ్మలు నాగేశ్వరరావు, అన్నపూర్ణమ్మలు దగ్గరుండి చూసుకున్నారు. ఇక సుప్రియ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన అక్కడమ్మాయ్ ఇక్కడబ్బాయ్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. కానీ మొదటి సినిమాతోనే తాను హీరోయిన్ గా సెట్ అవ్వలేనని డ్రాప్ అయ్యింది. ఇక అడవిశేషు హీరోగా నటించిన గూడచారి సినిమాతో సుప్రియ రీఎంట్రీ కూడా ఇచ్చింది.
Advertisement
ఇక ఒకప్పటి హీరో చరణ్ ను సుప్రియ పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లి తరవాత కూడా సుప్రియను విధి వెంటాడుతూనే ఉంది. సుప్రియ భర్త చరణ్ కూడా మరణించారు. యవ్వనంలోనే తల్లిని పెళ్లైన కొన్నాళ్లకే భర్తను కోల్పోయినప్పటికీ సుప్రియ ఏమాత్రం కృంగిపోలేదు. అంతే కాకుండా ఒంటి చేత్తో అక్కినేని స్టూడియోస్ బాధ్యతలు చూసుకుంటూ ఎంతోమంది మహిళలకు ఆదర్శంగా నిలుస్తోంది.
కొన్నేళ్లుగా సుప్రియ అక్కినేని స్టూడియోస్ ఎగ్జిగ్యూటివ్ డైరెక్టర్ గా బాధ్యతలను నిర్వర్తిస్తోంది. కేవలం బాధ్యతలను చూసుకోవడమే కాకుండా ఎంతో సమర్థవంతంగా పనిచేస్తూ ప్రశంసలు అందుకుంటోంది. పనిలో సుప్రియ ఎంతో స్ట్రిక్ట్ గా ఉంటారని చెప్పుకుంటారు. అంతే కాకుండా ఉద్యోల విషయంలో అయినా స్టూటియోలో షూటింగ్ ల విషయంలో అయినా తేడా వస్తే కఠినంగా వ్యవహరిస్తారని చెబుతుంటారు.
Also Read: తెలుగులో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న 5 డబ్బింగ్ సినిమాలు..!