Home » అబాట్‌ ఆల్‌రౌండ్‌ షో.. ఆసీస్‌దే వన్డే సిరీస్‌

అబాట్‌ ఆల్‌రౌండ్‌ షో.. ఆసీస్‌దే వన్డే సిరీస్‌

by Anji
Ad

స్వదేశంలో వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఆస్ట్రేలియా మరో మ్యాచ్‌ మిగిలుండగానే చేజిక్కించుకుంది. సిడ్నీ వేదికగా ఆదివారం ముగిసిన రెండో వన్డేలో కంగారూలు.. కరేబియన్‌ జట్టును 83 పరుగుల తేడాతో ఓడించారు. పేస్‌ ఆల్‌రౌండర్‌ సీన్‌ అబాట్‌ బంతితో మూడు వికెట్లు (3/40) పాటు బ్యాట్‌ (63 బంతుల్లో 69, 1 ఫోర్‌, 4 సిక్సర్లు) తోనూ రాణించడంతో ఆసీస్‌ ఈ మ్యాచ్‌లో విజయాన్ని అందుకుంది. ఈ గెలుపుతో స్టీవ్‌ స్మిత్‌ సేన.. 2-0 ఆధిక్యంతో వన్డే సిరీస్‌ను సొంతం చేసుకుంది.

Advertisement

Advertisement

సిడ్నీలోని సిడ్నీ క్రికెట్‌ గ్రౌండ్‌ (ఎస్‌సీజీ) వేదికగా ముగిసిన ఈ మ్యాచ్‌లో మొదట టాస్‌ గెలిచిన విండీస్‌.. ఆసీస్‌కు బ్యాటింగ్‌ అప్పగించింది. విండీస్‌ సారథి షై హోప్‌ నమ్మకాన్ని వమ్ము చేయకుండా విండీస్‌ బౌలర్లు ఈ మ్యాచ్‌లో చెలరేగారు. వంద పరుగుల లోపే ఆసీస్‌.. ఐదు వికెట్లను కోల్పోయింది. ట్రావిస్‌ హెడ్‌ స్థానంలో జట్టులోకి వచ్చిన జేక్‌ ఫ్రేసర్‌ (10)తో పాటు గత మ్యాచ్‌లో ధనాధన్‌ ఇన్నింగ్స్‌ ఆడిన జోష్‌ ఇంగ్లిస్‌ (9) విఫలమయ్యారు.

కామెరూన్‌ గ్రీన్‌ (33) ఫర్వాలేదనిపించినా కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ (33), మార్నస్‌ లబూషేన్‌ (26)లు విఫలమయ్యారు. మాథ్యూ షార్ట్‌ (41) ఆసీస్‌ను తిరిగి ట్రాక్‌లోకి తెచ్చాడు. 8వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన సీన్‌ అబాట్‌.. సదర్లండ్‌ (18) అండతో ఆసీస్‌ స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. అబాట్‌ పోరాటంతో ఆసీస్‌.. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. విండీస్‌ బౌలర్లలో గుడకేశ్‌ మోటీ మూడు వికెట్లు తీయగా రొమారియా షెపర్డ్‌, అల్జారీ జోసెఫ్‌లు తలా రెండు వికెట్లు పడగొట్టారు.

Visitors Are Also Reading