Home » Abbas: అలా నటించినందుకు వెక్కిరించారు.. కానీ, నా ఫ్యామిలీని పోషించడం కోసమే ఆ పని.. ఎమోషనల్ అయిన అబ్బాస్..!

Abbas: అలా నటించినందుకు వెక్కిరించారు.. కానీ, నా ఫ్యామిలీని పోషించడం కోసమే ఆ పని.. ఎమోషనల్ అయిన అబ్బాస్..!

by Srilakshmi Bharathi
Published: Last Updated on
Ad

హీరో అబ్బాస్ తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ఎన్నో సినిమాలు తీసి ఒకేసారి స్టార్ హీరోగా అబ్బాస్ గుర్తింపు తెచ్చుకున్నారు. అబ్బాస్ ఎంత స్పీడ్ గా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నారో అంతే స్పీడుగా ఇండస్ట్రీకి దూరం అవ్వాల్సి వచ్చింది. ఆయన నటించిన ప్రేమ దేశం సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో చెప్పక్కర్లేదు. ఆయనకు ఉన్న లవర్ బాయ్ ఇమేజ్ ఇప్పటికీ చెరిగిపోనిది. అమ్మాయిల కలల రాకుమారిడిలా కనిపించిన అబ్బాస్ సినిమాలకు దూరం అయ్యారు.

Advertisement

2015 లో సినిమాలకు గుడ్ బాయ్ చెప్పిన అబ్బాస్ ఫామిలీ తో కలిసి న్యూజిలాండ్ కు వెళ్లారు. ప్రస్తుతం ఆయన రీ ఎంట్రీ కి ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పలు ఇంటర్వ్యూలలో అబ్బాస్ కనిపిస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడిన అబ్బాస్ తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడారు. గతంలో నేను ఓ టాయిలెట్ క్లీనర్ యాడ్ లో నటించినందుకు నన్ను చాలా మంది ట్రోల్ చేసారని గుర్తు చేసుకున్నారు. నన్ను వెక్కిరిస్తూ చాలా మంది వీడియోలు కూడా చేసారు.

Advertisement

వాటి విషయంలో నేనేమీ బాధ పడలేదు. పరిశుభ్రత విషయమై అవగాహన కల్పించడం కోసమే ఆ ప్రకటనలో నటించానని చెప్పుకొచ్చారు. ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు.. టాయిలెట్స్ ను కూడా నీట్ గా ఉంచుకోవాలన్నారు. ఆ సమయంలో నాకు బిజీగా ఉండే పనులేమీ లేవు. వారు దాదాపు ఎనిమిది సంవత్సరాలకు డీల్ కుదుర్చుకున్నారు. ఆ సమయంలో ఆ డబ్బుతోనే నా ఫ్యామిలీని పోషించుకున్నాను. నా కుటుంబం కోసమే ఈ పని చేశాను అని చెప్పుకొచ్చారు.

 చెన్నై, బెంగళూరులో రజినీ జైలర్ ఫీవర్.. ఆఫీస్ లకు సెలవు, ఫ్రీ టికెట్స్..!

బాలకృష్ణ డేట్స్ కోసం ఆ స్టార్ డైరెక్టర్ ఎదురుచూస్తున్నాడా ? 

Visitors Are Also Reading