Home » త్వరలోనే అమీర్ ఖాన్ కూతురు పెళ్లి.. వేదిక అక్కడేనా ?

త్వరలోనే అమీర్ ఖాన్ కూతురు పెళ్లి.. వేదిక అక్కడేనా ?

by Anji
Published: Last Updated on
Ad

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతుంది. వచ్చే ఏడాది జనవరి 3న  ప్రియుడు నుపుర్ శిఖరేను పెళ్లాడనుంది.  గత ఏడాది సెప్టెంబర్ లో ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటి కానున్నారు. రెండేళ్ల పాటు డేటింగ్ లో ఉన్న వీరిద్దరూ 2020లో తమ రిలేషన్ ను అధికారికంగా ప్రకటించారు. ఇన్ స్తాలో ఇద్దరు కలిసి ఉన్న రొమాంటిక్ పిక్స్ షేర్ చేశారు.ఈ ప్రేమ జంట రాజస్థాన్ లోని ఉదయపూర్ లో మూడు రోజులపాటు జరిగే వేడుక కోసం ఇప్పటికే ప్లాన్ చేసినట్లు సమాచారం.

Advertisement

అమీర్ ఖాన్ సైతం తన కుమార్తె వివాహ వేడుక కోసం ఏర్పాట్లలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. నిశ్చితార్థం జరిగి ఇప్పటికే ఏడాది పూర్తి కావడంతో పెళ్లి డేట్ ను ఫిక్స్ చేశారు. 26 ఏళ్ల ఐరా తన పెళ్లి ప్రణాళికల గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఐరా మాట్లాడుతూ.. మేం జనవరి 3న పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. కానీ ఏ సంవత్సరం అనేది మేము నిర్ణయించుకోలేదు. జనవరి 3 మాకు చాలా ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే ఆరోజు మేమిద్దరం మొదటిసారి ముద్దు పెట్టుకున్న రోజు అంటూ ఆమె చెప్పుకొచ్చింది.

Advertisement

 గతంలో సైక్లింగ్ ఈవెంట్ సందర్భంగా నుపుర్ ఆమెకు ప్రపోజ్ చేశారు. అతను వత్తిరీత్యా ఫిట్ నెస్ కోచ్ కాగా.. అమీర్ ఖాన్ సుస్మితా సేన్ లాంటి ప్రముఖులకు శిక్షణ ఇచ్చాడు. ఇదిలా ఉంటే ఐరా.. అమీర్ ఖాన్ మాజీ భార్య రీనా దత్కుతా కుమార్తె. రీనాతో విడాకులు తీసుకున్న తర్వాత, డిసెంబర్ 2005లో కిరణ్ రావును అమీర్ ఖాన్ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వీరిద్దరూ 2022లో విడిపోయారు. అమీర్ ఖాన్ కుమార్తె 2019లో యూరిపిడెస్ మెడియా నాటకం ద్వారా దర్శకురాలిగా అరంగేట్రం చేసింది. అయితే తనకు నటిగా మారడం ఇష్టం లేదని ఐరా స్పష్టం చేసింది.

 

Visitors Are Also Reading