ఉమ్రాన్ మాలిక్.. ఈ పేరు ఐపీఎల్ 2021 సీజన్ తర్వాత వినిపించింది. కానీ ఐపీఎల్ 2022 సీజన్ లో మాత్రం మారుమ్రోగిపోయింది. గత ఏడాది ఐపీఎల్ లో వెలుగులోకి వచ్చినా ఉమ్రాన్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈ ఏడాది జరిగిన మెగవేలం ముందు 4 కోట్లు పెట్టి రిటైన్ చేసుకుంది. అందుకు తగ్గిన విధంగానే ఉమ్రాన్ కూడా ఆడాడు. ప్రతి మ్యాచ్ లో 150 కిలో మీటర్లకు వేగం తగ్గకుండా బంతులు సంధించిన ఉమ్రాన్ ను టీం ఇండియాలోకి తీసుకోవాలని చాలా మంది కోరారు. అందుకు తగ్గిన విధంగానే ఈ ఐపీఎల్ ముగిసిన వెంటనే టీం ఇండియా తలపడిన సౌత్ ఆఫ్రికా టీ20 సిరీస్ కు మాలిక్ ను ఎంపిక చేసింది బీసీసీఐ.
Advertisement
కానీ ఈ సిరీస్ లో మాలిక్ కు తుది జట్టులో అవకాశం రాలేదు. ఆ తర్వాత పాండ్య కెప్టెన్సీలో ఐర్లాండ్ వెళ్లిన రెండో భారత జట్టులో చోటు దకించుకున్న మాలిక్.. మొదటి మ్యాచ్ లో ఒక్కే ఓవర్ వేయగా.. రెండో మ్యాచ్ లో పర్వాలేదు అనిపించాడు. ఆ ఆతర్వాత ఇంగ్లాండ్ కు వెళ్లిన మాలిక్.. అక్కడ మొదటి టీ20లో తుది జట్టులోకి వచ్చాడు. కానీ విఫలమయ్యాడు. దాంతో ఈ పర్యటన ముగిసిన తర్వాత టీం ఇండియా 5 టీ20ల సిరీస్ కోసం వెళ్లనున్న వెస్టిండీస్ పర్యటనకు మాలిక్ ను బీసీసీఐ ఎంపిక చేయలేదు.
Advertisement
ఇక ఈ విషయం పై ఆకాష్ చోప్రా మాట్లాడుతూ.. బీసీసీఐ ఉమ్రాన్ కెరియర్ ను నాశనం చేస్తుంది అని అన్నాడు. మొదట అతనికి జట్టులో చోటు కల్పించి కేవలం మూడు మాస్క్ లు ఆడించారు. అందులో అతను వేసినవి 9 పవర్లూ మాత్రమే. అందులోనే అతను అద్భుతాలు చేయాలనీ అనుకోకూడదు. ఉమ్రాన్ ఆడగలడు అనుకంటె ఎంపిక చేయండి. లేదంటే లేదు. ఇలా రెండు మూడు మ్యాచ్ లు ఆడించి జట్టు నుంచి తీసేయవద్దు. ఓ మంచి మేనేజిమెంట్ కింద ఉమ్రాన్ ఉంటె.. అతని కెరియర్ అనేది ఇలా అయ్యేది కాదు అని చోప్రా పేర్కొన్నాడు.
ఇవి కూడా చదవండి :