Home » ఐపీఎల్ పొడిగింపుకు ఒప్పుకున్న ఐసీసీ..!

ఐపీఎల్ పొడిగింపుకు ఒప్పుకున్న ఐసీసీ..!

by Azhar

బీసీసీఐని ప్రపంచంలో అత్యంత ధనవంతమైన క్రికెట్ బోర్డుగా నిలిపింది ఐపీఎల్. 2008 లో ప్రారంభామైన ఈ లీగ్ అనేది ప్రతి ఏటా దాని పాపులారిటీ అనేది పెంచుకుంటూనే ఉంది. ఇక ఇప్పుడు ప్రపంచంలో అత్యంత ఖరీదైన లీగ్ లలో రెండో లీగ్ గా అవతరించింది. అయితే ప్రపంచంలో ఉన్న అందరూ స్టార్ క్రికెటర్స్ అనేవాళ్ళు ఇందులో పాల్గొంటారు. అలాగే ఇందులో ఒక్క సీజన్ ఆడితే చాలు అనుకునేవారు కూడా ఉన్నారు. ఇక ఇలాంటి ఈ సీజన్ ప్రస్థుం రెండు నెలల పాటు జరుగుతుంది. కానీ దానిని రెండున్నర నెలలు చేయాలని బీసీసీఐ నిర్ణయించుకుంది.

అందులో భాగంగానే ఐపీఎల్ ను ఐసీసీ ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్స్ లో కూడా చేర్చాలి అనే ప్రతిపాదనను ఐసీసీ ముందు ఉంచింది బీసీసీఐ. కానీ దీనిపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. అలా చేస్తే ద్వైపాక్షిక సిరీస్లు అనేవి తగ్గిపోతాయి… అలా నష్టం వస్తుంది అని పేర్కొంది. కానీ తాజాగా ఐసీసీ బీసీసీఐ నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్ అనేది ఇచ్చింది. ఐపీఎల్ ను రెండు నెలల నుండు మరికొన్ని ఎక్కువ రోజులు నిర్వహించడానికి ఒప్పుకుంది.

ఇక ఐసీసీ తీసుకున్న ఈ నిర్ణయంతో ఐపీఎల్ జరుగుతున్న సమయంలో ద్వైపాక్షిక సిరీస్ లు అనేవి దాదాపు జరగవు. అందువల్ల విదేశీ ఆటగాళ్లు ఎటువంటి సమస్య లేకుండా ఐపీఎల్ లో ఆడవచ్చు. అయితే ఈ ఏడాది ఐపీఎల్ లో రెండు కొత్త జట్లు ఐపీఎల్ లో చేరగా.. మ్యాచ్ లను పెంచాలని బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఇక రాబోయే ఐదేళ్లలో ఐపీఎల్ యూక మ్యాచ్ ల సంఖ్యను 72 నుండి 94కు తీసుకువెళ్లే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఐసీసీ అనుమతి కూడా రావడంతో ఈ మ్యాచ్ లను పెంచే ప్రక్రియ అనేది వచ్చే ఏడాది నుండే ప్రారంభించాలని బీసీసీఐ అనుకుంటున్నట్లు తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి :

మరోసారి కోర్టుకు వెళ్లిన గంగూలీ..!

విరాట్ కు ఎందుకు సపోర్ట్ చేసాడో చెప్పిన బాబర్..!

Visitors Are Also Reading