Ad
ఐపీఎల్ 2021 లో చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ గెలవడంలో ముఖ్య పాత్ర పోషించిన రవీంద్ర జడేజా ఈ ఏడాది మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. అయితే ఈ ఐపీఎల్ 2022 కోసం జరిగిన మెగవేలంలో చెన్నై జడేజాను 16 కోట్లు పెట్టి రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత అందరూ ఊహించిన విధంగా సీజన్ ప్రారంభానికి రెండు రోజుల ముందు కెప్టెన్సీ పగ్గాలు కూడా జడేజా చేతికి ఇచ్చింది. కానీ నాయకునిగా జడేజా సక్సెస్ కాలేకపోయాడు. చాలా దారుణంగా విఫలమయ్యాడు. అది అతను ఆటపై కూడా ప్రభావం చూపింది.
ఆ తర్వాత మళ్ళీ చెన్నై కెప్టెన్ గా ధోని వచ్చాడు. కానీ ఐపీఎల్ చివరి మ్యాచ్ లలో జడేజా కనిపించలేదు. అతను గాయం కారణంగా జట్టు నుండి బయటకు వచ్చిన అభిమానులు మాత్రం చెన్నై యాజమాన్యానికి జడేజాకు ఏదో గొడవ జరిగింది అని అనుకున్నారు. అందువల్ల వచ్చే ఏడాది ఐపీఎల్ లో జడేజాను చెన్నై వేలంలోకి వదిలేస్తుంది అని కూడా వార్తలు వస్తున్నాయి. ఇక తాజాగా ఈ వార్తాల పై భారత మాజీ ఆటగాడు ప్రస్తుత కామెంటేటర్ ఆకాష్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేసాడు.
ఆకాష్ చోప్రా మాట్లాడుతూ… జడేజా విషయంలో చాలా మందికి చాలా అనుమానాలు ఉన్నాయి. అతడిని వచ్చే ఏడాది చెన్నై వదిలేస్తుంది అని అంటున్నారు. అయితే జడేజాను వదులుకుంటే చెన్నైకి 16 కోట్ల లాభం అనేది నిజం. కానీ ఆ 16 కోట్లకు ఇంకొన్ని కోట్లు కలిపి కొనాలి అనుకున్న మళ్ళీ అతని లాంటి అతఃడు ఆ జట్టుకు దొరకడు అని అన్నారు. అదే విధంగా చెన్నై జట్టులో చాలా మంది సీనియర్లను ఉంచుకుంది అని.. వారిని తీసేసి యువ ఆటగాళ్లకు అవకాశం ఇస్తే బాగుంటుంది అని తెలిపాడు.
ఇవి కూడా చదవండి :
సచిల్ లాగే వయస్సులో పెద్దవారైన భార్యలు ఉన్న క్రికెటర్లు ఎవరో మీకు తెలుసా…?
పంత్ ను వెనుకేసుకొచ్చిన గంగూలీ…!
Advertisement