Home » ఆధార్ సంస్థ‌ కీల‌క నిర్ణ‌యం.. ఇక నుంచి వాటితో కూడా లింక్..!

ఆధార్ సంస్థ‌ కీల‌క నిర్ణ‌యం.. ఇక నుంచి వాటితో కూడా లింక్..!

by Anji
Ad

ఆధార్  ప్పుడు అన్నింటికీ  చాలా కీల‌కం, ప్ర‌భుత్వ ప‌ని నుంచి బ్యాంకింగ్ లేదా ఇత‌ర ముఖ్య‌మైన ప‌ని వ‌ర‌కు ఆధార్ త‌ప్ప‌నిస‌రి అయింది. అదేవిధంగా ఆధార్ కార్డులో ఇచ్చిన సమాచారంతో మ‌నంద‌రికీ పూర్తిగా అప్‌డేట్ కావ‌డం చాలా ముఖ్యం. భార‌త విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఆధార్‌కు సంబంధించిన అన్ని ర‌కాల అప్‌డేట్‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు అందిస్తుంది.


ఆధార్‌కు సంబంధించిన మోసాన్ని అరిక‌ట్ట‌డానికి UIDAI ధ‌న్సు ప్లాన్  తీసుకొస్తోంది. ఇక నుంచి UIDAI జ‌న‌న‌, మ‌ర‌ణ డేటాను ఆధార్‌తో లింక్ చేయాల‌ని నిర్ణ‌యించింది. కింద ఇప్పుడు అప్పుడే పుట్టిన పిల్ల‌ల‌కు తాత్కాలిక ఆధార్ నెంబ‌ర్ జారీ చేయ‌బ‌డుతుంది. త‌రువాత బ‌యోమెట్రిక్ డేటాతో అప్‌గ్రేడ్ చేయ‌బ‌డుతుంది. మ‌ర‌ణాల న‌మోదు రికార్డును ఆధార్ తో అనుసంధానిస్తారు. త‌ద్వారా ఈ నెంబ‌ర్ దుర్వినియోగాన్ని నిరోధించ‌వ‌చ్చు. కార‌ణంగా ఇప్పుడు ప్ర‌తి వ్య‌క్తి పుట్టుక నుంచి మ‌ర‌ణం వ‌ర‌కు డేటా బేస్‌కు జోడించ‌బ‌డుతుంది.

Advertisement

Advertisement

అప్పుడే పుట్టిన బిడ్డ‌, వారి కుటుంబం ప్ర‌భుత్వ‌ప‌థ‌కాల ప్రయోజ‌నాల‌ను పొందేవిధంగా చేస్తుంది. దీంతో సామాజిక భ‌ద్ర‌త ప్ర‌యోజ‌నాలు ఎవ్వ‌రూ కూడా కోల్పోరు. అదేవిధంగా డెత్ డేటాతో ఆధార్‌ను లింక్ చేయ‌డం వ‌ల్ల డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫ‌ర్ ప‌థ‌కం దుర్వినియోగం నిరోధించ‌బ‌డుతుంది. ల‌బ్దిదారుడు మ‌ర‌ణించిన త‌రువాత కూడా అత‌ని ఆధార్‌ను ఉప‌యోగిస్తార‌నే అనేక కేసులు ఇప్పుడు తెర‌పైకి వ‌స్తున్నాయి. దీని కోసం త్వ‌ర‌లో 2 ఫైల‌ట్ ప్రాజెక్ట్‌ల‌ను ప్రారంభించ‌నున్నారు. మ‌రోవైపు UAIDAI జీరో ఆధార్‌ను కేటాయించాల‌ని యోచిస్తోంది. న‌కిలీ ఆధార్ నెంబ‌ర్ జ‌న‌రేట్ కాదు. అదేవిధంగా ఎలాంటి ఫోర్జ‌రీ ఉండ‌దు. దీని ప్ర‌కారం.. ఓ వ్య‌క్తికి ఒక‌టి కంటే ఎక్కువ ఆధార్ నెంబ‌ర్లు కేటాయించ‌బ‌డ‌వు. పుట్టిన‌, నివాస లేదా ఆదాయ రుజువు లేని వ్య‌క్తుల‌కు జీరో ఆధార్ నెంబ‌ర్ ఇవ్వ‌బ‌డుతుంది.

Also Read :

వాట్సప్ లో కొత్తగా ఈ ఆప్షన్ వచ్చిందని తెలుసా ?

జియో, ఎయిర్‌టెల్ క‌స్ట‌మ‌ర్ల‌కు శుభ‌వార్త‌.. రూ.100 లోపు ల‌భించే ఈ ప్లాన్‌ల గురించి మీకు తెలుసా..?

 

Visitors Are Also Reading