ప్రముఖ సంగీత దర్శకుడు మరియు గొప్ప సింగర్ బప్పీ లహరీ అనారోగ్యంతో కన్నుమూశారు. బప్పీ లహరి గతేడాది కరోనా బారినపడి ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. ఆ తరవాత ఆయనకు మరిన్ని అనారోగ్య సమస్యలు చుట్టుముట్టినట్టు తెలుస్తోంది. మల్టీబుల్ ఇన్ఫెక్షన్ ల కారణంగా బప్పీ లహరి మృతి చెందారని డాక్టర్ లు నిర్ధారించారు. ఇదిలా ఉండగా 69ఏళ్ల బప్పీ లహరి మ్యూజిక్ డైరెక్టర్ గా సింగర్ గా ఎంతో పాపులారిటీని సంపాదించుకున్నారు.
ALSO READ : నాగచైతన్య ఓకే అంటే నీతో పెళ్లికి రెడీ.. సమంత ట్వీట్..!
Advertisement
బప్పీ బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు స్వరాలు సమకూర్చారు. అంతే కాకుండా తెలుగు సినిమాలతో కూడా బప్పీకి ఎంతో అనుబంధం ఉంది. మొదటగా సింహాసనం సినిమాకు బప్పీ సంగీత దర్శకుడిగా పనిచేశాడు. కాగా తెలుగు రాని వ్యక్తికి తెలుగు సినిమాలో ఎలా ఆఫర్ ఇస్తారంటూ ఎన్నో విమర్శలు కూడా వచ్చాయి. కానీ తన సంగతంతో బప్పీ ఆ విమర్శలను తిప్పి కొట్టారు. సింహాసనం సినిమాను మ్యూజికల్ హిట్ గా నిలిపారు. ఆ తరవాత స్టేట్ రౌడీ, రౌడీ ఇన్స్పెక్టర్, సామ్రాట్ సినిమాలకు ఆయన స్వరాలు సమకూర్చారు.
Advertisement
కేవలం తెలుగు సినిమాలకు స్వరాలు సమకూర్చడమే కాకుండా పాటలు కూడా పాడారు. బాలయ్య చిరంజీవిలకు మంచి హిట్స్ ఇచ్చారు బప్పీ లహరి. సినిమాల విషయం పక్కన పెడితే బప్పీ లహరి 2014లో బీజేపీ నుండి ఎంపీగా పోటీ చేశారు. మరోవైపు బప్పీ చూడటానికే డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నారు.
ఒంటినిండా బంగారం వేసుకుని డిఫరెంట్ కాస్ట్యూమ్ లు ధరించి బప్పీ ఎక్కడకు వెళ్లినా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. అలాంటి బప్పీ మరణించడంతో పలువురు సినిమా ప్రముఖులు ఆయన మృతికి సంతాపం ప్రకటిస్తున్నారు. బాలీవుడ్ ప్రముఖులు బప్పీ మరణవార్త విని ఆయన ఇంటికి క్యూ కడుతున్నారు.