Home » పాకిస్తాన్ యువ‌కుడు : ఆన్‌లైన్ ప్రేమ‌.. ఎడారి పాలు..!

పాకిస్తాన్ యువ‌కుడు : ఆన్‌లైన్ ప్రేమ‌.. ఎడారి పాలు..!

by Anji
Ad

ప్రేమ అనేది కొన్నిసార్లు క‌లిసేందుకు య‌త్నిస్తుంది. మ‌రికొన్ని సార్లు త‌ప్ప‌ట‌డుగు వేసేందుకు దారి తీస్తుంది. ఇంకొన్నిసార్లు అటు, ఇటు, ఎటు కాకుండా పోతుంది. చివ‌రికీ ఎడారికీ కూడా ఈడ్చ‌డానికి వెనుకాడ‌దు. ఇలాంటి ఘ‌ట‌నే ఒక‌టి చోటు చేసుకుంది. పాకిస్తాన్‌లోని బ‌హావ‌ల్‌పూర్ ప‌ట్ట‌ణానికి చెందిన 21 ఏళ్ల మొహ‌మ్మ‌ద్ అహ్మ‌ర్ ఇలాంటి చిక్కుల్లోనే ప‌డ్డారు. ముంబ‌యిలోని త‌న ప్రేయ‌సిని క‌లుసుకునేందుకు గ‌త‌నెల అహ్మ‌ర్ అక్ర‌మంగా భార‌త‌, పాకిస్తాన్ స‌రిహ‌ద్దులు దాట‌డానికి య‌త్నించారు. గ‌మ్య‌స్థానికి చేరుకోకుండా ఎడారిలో చిక్కుకుపోయాడు అహ్మ‌ర్‌. అయితే భార‌త భ‌ద్ర‌తా ద‌ళం ఆ యువ‌కుడిని క‌స్ట‌డీలోకి తీసుకుని విచార‌ణ చేప‌డుతుంది. విచార‌ణ స‌మ‌యంలో అహ్మ‌ర్ వ‌ద్ద రూ.500 ల‌భించాయి. త‌న ప్రేమ క‌థ‌ను అధికారులు వివ‌రించాడు.

 

మొహమ్మద్ అహ్మర్

Advertisement

సోష‌ల్ మీడియాలో ఓ అమ్మాయితో కాంటాక్ట్‌లో ఉన్నాన‌ని, వారిద్దరూ గంటల తరబడి మాట్లాడుకునేవారని బహావల్‌పూర్‌లోని ఆయన బంధువు ఒకరు పేర్కొన్నారు. అయితే అహ్మ‌ర్ వీసా కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు కానీ అది మంజూరు కాలేదు. అక్ర‌మంగా స‌రిహ‌ద్దు దాటాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు అధికారులతో పేర్కొన్నారు. ముంబ‌యికి చెందిన ఓ అమ్మాయితో ప‌రిచ‌యం ఏర్ప‌డి.. అది ప్రేమగా మారింది. త‌న ప్రేయ‌సి ముంబ‌యి ర‌మ్మ‌ని కోరింది. అత‌ను స‌రిహ‌ద్దు దాటిన ప్రాంతం ముంబ‌యికి సుమారుగా 1400 కీమీ దూరంలో ఉన్న‌ది.

 

ఈమధ్య కాలంలో సరిహద్దులు దాటిన ఘటన ఇదొక్కటే కాదు

Advertisement

డిసెంబ‌ర్ 04న బ‌హావ‌ల్‌పూర్ స‌మీపంలో రాజ‌స్థాన్ ఎడారి ప్రాంతంలో అనూఫ్ గ‌ఢ్ వ‌ద్ద భార‌త్‌-పాకిస్తాన్ స‌రిహ‌ద్దును అహ్మ‌ర్ దాటారు. ఎస్‌హెచ్ఓ పూల్‌చంద్ ఘ‌ట‌న‌ను ధృవీక‌రించ‌గా.. భ‌ద్ర‌తా ద‌ళానికి స్వ‌యంగా లొంగిపోవాల‌ని చెప్పారు. సైనికుల వ‌ద్ద లొంగిపోయిన‌ట్టు ఎస్పీ చెప్పారు. అయితే త‌న ప్రేయ‌సీ మాత్రం స‌ర‌దాగా మాట వ‌రుస‌గా నువ్వు రా అని చెప్పాను. నిజంగా వ‌స్తాడ‌నుకోలేదు అని క‌మిటీకి చెప్పారు. మ‌రోవైపు అహ్మ‌ర్ తండ్రి అనారోగ్యంతో మంచంపైనే ఉన్నార‌ని, వృద్ధురాలు అయిన త‌ల్లి త‌న కొడుకు రాక కోసం ఎదురుచూస్తూ ఉన్నార‌ని బంధువు అర్ష‌ద్, జ‌ర్న‌లిస్ట్ మ‌హ్మ‌ద్ ఇబ్రాన్ భిండ‌ర్‌తో వివ‌రించారు. అహ్మ‌ర్‌ను త‌న త‌ల్లితో గ్రామ లంబార్దార్‌తో అధికారులు మాట్లాడించారు. కానీ విడుద‌ల కోసం మాత్రం ఎలాంటి అధికారిక చ‌ర్య‌లు తీసుకోలేదు అని నివేదిక‌లు పేర్కొంటున్నాయి.

 

ఆన్‌లైన్ ప్రేమ వ్యవహారంలో మరో యువకుడు కూడా జూలైలో సరిహద్దు దాటేందుకు ప్రయత్నించాడు

ఈ మ‌ధ్య కాలంలో స‌రిహ‌ద్దు దాటిన అనేకం ఉన్నాయ‌ని. బ‌హావ‌ల్‌పూర్‌కు చెందిన 30 ఏండ్ల అల్లావుద్దీన్ శ్రీ‌గంగాన‌గ‌ర్ స‌రిహ‌ద్దును దాటారు. విచార‌ణ‌లో అనుమాన‌స్పదంగా ఏమీ క‌నిపించ‌లేదు. 2021లో సింధ్‌లో తార్పార్క‌ర్ జిల్లాకు చెందిన ఓ యువ‌కుడు త‌న కుటుంబంతో గొడ‌వ‌ప‌డి గుజ‌రాత్ రాష్ట్రంలోని క‌చ్ జిల్లాలోకి ప్ర‌వేశించారు. 2021 ఏప్రిల్‌లో బార్మ‌ర్ సెక్టార్‌లోని ఎనిమిదేళ్ల చిన్నారి కూడా అనుకోకుండా అంత‌ర్జాతీయ స‌రిహ‌ద్దును దాటింది. 2020లో ప్రియురాలు ఇంటికి గుట్టుచ‌ప్పుడు కాకుండా వెళ్లేందుకు రాజ‌స్థాన్‌లోని బార్మ‌ర్‌కు చెందిన వ్య‌క్తి సింధ్‌కు వెళ్లారు. 2020జులైలో మ‌హారాష్ట్రలోని ఉస్మానాబాద్‌కు చెందిన వ్య‌క్తి క‌రాచికీ చెందిన ఓ అమ్మాయిని క‌ల‌వ‌డానికి స‌రిహ‌ద్దు దాటేందుకు య‌త్నించాడు. ఇలాంటి ఘ‌ట‌న‌ల‌న్నీ ఎక్కువ‌గా ఆన్‌లైన్ ప్రేమ వ్య‌వ‌హారమే కావ‌డం విశేషం.

Visitors Are Also Reading