Home » గీతాఆర్ట్స్ ముందు అర్థనగ్నంగా రోదిస్తున్న మహిళ.. న్యాయం చేయాలని ఆందోళన..!!

గీతాఆర్ట్స్ ముందు అర్థనగ్నంగా రోదిస్తున్న మహిళ.. న్యాయం చేయాలని ఆందోళన..!!

by Sravanthi
Ad

హైదరాబాదులోని జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 గీతా ఆర్ట్స్ కార్యాలయం వద్ద మహిళా అర్థనగ్నంగా ఆందోళనకు దిగడం స్థానికంగా కలకలం రేపింది. గీతాఆర్ట్స్ నుంచి తనకు రావాల్సిన డబ్బులు ఇప్పించాలంటూ మహిళ ఆర్టిస్ట్ ధర్నాకు దిగింది. గతంలోనే ఈ మహిళా ఫిలింఛాంబర్ వద్ద కూడా ఆందోళన చేపట్టిన తనకు న్యాయం జరగలేదని గీతా ఆర్ట్స్ వద్ద అర్థనగ్నంగా నిరసన తెలిపింది.

తనకు న్యాయం చేయాలంటూ కన్నీళ్ళు పెట్టుకొని రోదించింది. ఆమె పరిస్థితి చూసి కొందరు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి వచ్చిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించారు. పూర్తి వివరాల్లోకి వెళితే టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందినటువంటి సునీత బోయిన్పల్లి అనే ఆర్టిస్టు తనకు డబ్బులు రావాలని ఎన్నిసార్లు అడిగినా గీతాఆర్ట్స్ కార్యాలయం వారు ఇవ్వడంలేదని ధర్నా చేసింది. ఈ విధంగా ఆమె ఇదివరకు నిర్మాత బన్నీవాసు వేధిస్తున్నాడని చెప్పి ఆందోళనకు దిగిన సందర్భంలో కేసు కూడా నమోదైంది.

Advertisement

Advertisement

అప్పట్లో సినీ అవకాశాల పేరుతో బన్నీ వాస్ తనను వేధించాడని చెప్పుకొచ్చింది. నేను ఆత్మహత్య చేసుకుంటానని సునీత ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం ఆ మధ్య కలకలం రేపింది. దీనికి ప్రధాన కారణం ఆమెకు సినిమా అవకాశాలు లేకపోవడంతో ఈ విధంగా సునిత వ్యవహరిస్తోందని కొంతమంది అంటున్నారు. కొంతమందేమో పేరు సంపాదించుకోవడానికి ఇలా చేస్తోందని పట్టించుకోవాల్సిన అవసరం లేదని అంటున్నారు. ఇంకొంతమంది ఆమె మానసిక పరిస్థితి బాగోలేదని, ఈ క్రమంలో పోలీస్ స్టేషన్లో సునీతాకు కౌన్సిలింగ్ కూడా ఇచ్చినట్లు సమాచారం.

also read;

అలా మొద‌లైంది సినిమాకి నందినిరెడ్డికి పారితోషికం ఎంత ఇచ్చారో తెలుసా..?

ర‌హ‌స్యంగా సోనాక్షి సిన్హా నిశ్చితార్థం..!

 

Visitors Are Also Reading