Home » ర‌హ‌స్యంగా సోనాక్షి సిన్హా నిశ్చితార్థం..!

ర‌హ‌స్యంగా సోనాక్షి సిన్హా నిశ్చితార్థం..!

by Anji
Ad

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హాకు సంబంధించిన ఓ వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె షేర్ చేసిన ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి. ఆ ఫోటోల కారణంగా సోనాక్షికి సీక్రెట్‌గా నిశ్చితార్థం అయిందనే ప్ర‌చారం జ‌రుగుతోంది. డైమండ్ రింగ్ తొడిగిన ఆ ఫోటోలు ఉండటం.. ఓ వ్య‌క్తి ఆమె చేతిని ప‌ట్టుకుని ఉండ‌డంతో నిశ్చితార్థం వార్త‌ల‌కు మ‌రింత ఊత‌మిచ్చింది.

Advertisement

త‌న డ్రీమ్ నెర‌వేర‌బోతున్న‌ద‌ని ఇన్‌స్టాలో రాసుకొచ్చింది సోనాక్షి సిన్హా. ఇవాళ నా లైఫ్‌లో బిగ్ డే అని.. నా పెద్ద క‌ల‌ల్లో ఒక‌టి నెర‌వేర‌బోతుంది. ఇక మీతో ఈ విషయాన్ని పంచుకోవాలంటే వేచి ఉండలేక పోతున్నాను. దీనిని నమ్మ‌లేక‌పోతున్నా అంటూ ల‌వ్ ఎమోజీల‌ను సైతం పంచుకున్న‌ది ఈ స్టార్ కిడ్‌. దీనితో కచ్చితంగా సోనాక్షి ఎంగేజ్‌మెంట్ అయిందంటూ సోషల్ మీడియాలో చర్చ జరగుతోంది. సోనాక్షి ఎలా సూచిస్తుందో చూడాలి మరి.

ఇదిలా ఉండ‌గా.. ఐటీవ‌లే స‌ల్మాన్ ఖాన్‌తో సోనాక్షి ఎంగేజ్‌మెంట్ అయిన‌ట్టు వార్త‌లు వినిపించాయి. ఫిర్యాదు సోనాక్షి ఖండించింది. స్టార్ కిడ్‌గా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సోనాక్షి స‌ల్మాన్ ఖాన్‌తో దబాంగ్ సినిమాతో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసింది. బొద్దుగా ఉంటే ఈ అందాల తార త‌న అందాల‌తో అంద‌రినీ క‌నువిందు చేస్తోంది.

ఇది కూడా చదవండి: 

సర్కారు వారి పాట మొదట్లో ఆ స్టార్ హీరో కోసమే సిద్ధం చేశారా..?

అవతార్2 ట్రైల‌ర్ వ‌చ్చేసింది.. చూస్తే పిచ్చేక్కాల్సిందే..!

 

Visitors Are Also Reading