ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించి చరిత్ర సృష్టించిన భారత షూటర్ అభినవ్ బింద్రాకు అరుదైన గౌరవం దక్కింది. ఈ ఏడాది ప్యారిస్ విశ్వక్రీడల్లో బింద్రా భారత టార్చ్ బేరర్‌గా ఎంపికయ్యాడు. ప్రస్తుతం అథ్లెట్స్ కమిషన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ(ACOITC) సభ్యుడిగా ఉన్న బింద్రా ఒలింపిక్ జ్యోతిని వెలిగించనున్నాడు. ఈ గౌరవం దక్కడంతో ఈ మాజీ షూటర్ పట్టలేనంత సంతోషంలో ఉన్నాడు. పారిస్ ఒలింపిక్స్‌లో టార్చ్ బేరర్‌గా ఎంపికైనందుకు చాలా హ్యాపీగా ఉంది. ఒలింపిక్ జ్యోతి శాంతి, పట్టుదలకు ప్రతీక. ఈ కాగడ మనందరి ఐక్యతను, కలలకు ప్రతిరూపం. ఈ గౌరవం నిజంగా చాలా గొప్పది అని బింద్రా తన ఎక్స్ (ట్విట్టర్) లో ఈ విషయాన్ని షేర్ చేశాడు.
Advertisement
Advertisement
ఒలింపిక్ జ్యోతిని గ్రీస్‌లోని ఒలింపియాలో మొదట వెలిగిస్తారు. ఆ తర్వాత ఆ దేశంలో ప్రదర్శన ముగిశాక ఆ జ్యోతిని సముద్ర మార్గం గుండా పెద్ద ఓడలో ఫ్రాన్స్‌కు తరలిస్తారు. ఏప్రిల్ 16 నుంచి జూలై 26 వరకు ఒలింపిక్ టార్చ్ రీలే జరుగనుంది. ఈ రీలేలో బింద్రా ఒలింపిక్ కాగడను వెలిగించనున్నాడు. 68 రోజుల పాటు జరిగే ఈ రీలే వివిధ దేశాలకు చెందిన 10 వేల మంది అథ్లెట్లు పాల్గొననున్నారు. భారత షూటర్ అభినవ్ బింద్రా కీడా విషయాన్నికి వస్తే.. బీజింగ్‌లో 2018లో జరిగిన ఒలింపిక్స్‌లో షూటర్ బింద్రా చరిత్ర సృష్టించాడు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో స్వర్ణ పతకంతో మువ్వన్నెల జెండాను రెపరెలాడించాడు. వెండి పతకంతో రాజ్యవర్ధర్ సింగ్ రాథోడ్ నెలకొల్పిన రికార్డును బ్రేక్ చేశాడు. జూలై 26వ తేదీన ప్యారిస్‌లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్నాయి.
స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!