Home » చిరంజీవి పై కోపంతో సినిమా సెట్ బయటే నిలబెట్టి మరి తిట్టేసిన స్టార్ ప్రొడ్యూసర్ అతడేనా ?

చిరంజీవి పై కోపంతో సినిమా సెట్ బయటే నిలబెట్టి మరి తిట్టేసిన స్టార్ ప్రొడ్యూసర్ అతడేనా ?

by Bunty
Published: Last Updated on
Ad

మెగాస్టార్ చిరంజీవి అంటే టాలీవుడ్ లో ట్రెండ్ సెట్టర్ అనే చెప్పాలి. ఆయన్ను ఆదర్శంగా తీసుకునే చాలామంది సినిమాల్లోకి వచ్చారు. సాధారణ కానిస్టేబుల్ కుమారుడు గా సినిమాల్లోకి ఎంట్రీ స్టార్ హీరోగా ఎదగటం తో ఆయన అంటే చాలామంది గౌరవిస్తారు. అయితే ఆ సక్సెస్ చిరంజీవికి ఊరికే రాలేదు. దానికోసం ఆయన ఎంతో కష్టపడేవారు. ఐతే, చిరంజీవి నటించిన సినిమాల్లో శివుడు శివుడు శివుడు సినిమా కూడా ఒకటి. స్టార్ డైరెక్టర్ కోదండరామిరెడ్డి డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కింది.

Advertisement

 

చిరంజీవికి జోడిగా ఈ సినిమాలో రాధిక హీరోయిన్ గా నటించారు. కే. చక్రవర్తి ఈ సినిమాకు సంగీతం అందించారు. శివుడు శివుడు శివుడు సినిమాకు క్రాంతి కుమార్ నిర్మాత కాగా, కోదండరామిరెడ్డి ఒక సన్నివేశంలో చిరంజీవిని తలుపుపైన ఎడమ చేయి పెట్టాలని చెప్పాడు. అయితే చిరంజీవి తనకు రైట్ హ్యాండ్ కంఫర్ట్ అని చెప్పి అలా చెయ్యి పెట్టడానికి నిర్మాతను ఒప్పించారు. అయితే చిరంజీవి అలా చెప్పడంతో క్రాంతి కుమార్ ఇష్టానుసారం చిరంజీవిని తిట్టారు. చిరంజీవి సైతం ప్రొడ్యూసర్ అలా తిట్టడంతో ఆశ్చర్యపోయారు.

Advertisement

చిరంజీవిని అవమానించేలా క్రాంతి కుమార్ కామెంట్ చేయడం కోదండరామిరెడ్డికి కూడా నచ్చలేదు. చిరంజీవి ఈ సినిమాలోని ఎన్నో సన్నివేశాల కోసం చాలా కష్టపడ్డారు. క్రాంతి కుమార్ ప్రవర్తన వల్ల చిరంజీవి భోజనం చేయని రోజులు కూడా ఉన్నాయని సమాచారం. క్రాంతి కుమార్ అంతగా ఇబ్బంది పెట్టినా భవిష్యత్తులో కూడా ఆయన నిర్మాణంలో తెరకెక్కిన సినిమాలలో మెగాస్టార్ చిరంజీవి నటించడం గమనార్హం.

Read alsoTollywood Telugu News, Telugu News

Visitors Are Also Reading