సాధారణంగా పెళ్లిళ్లు స్వర్గంలో జరుగుతాయన్నది నిజమే కానీ, ఇది మాత్రం జైలులో భిన్నంగా జరిగిన పెళ్లి. ప్రియురాలి వర్గాల నేరారోపణతో జైలు పాలైన ప్రేమికుడితో చట్టపరమైన లాంఛనాలతో పెళ్లి జరిగింది. జైలు అధికారుల అనుమతి మేరకు వీరి వివాహం సనాతన ధర్మం, ఆచారాల ప్రకారం వేడుకగా జరిపించారు. వివరాల్లోకి వెళ్తే.. స్థానిక ఝరపడా ప్రత్యేక జైలు పెళ్లి కళతో కళకళలాడింది.
Advertisement
ఈ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. వధూవరుల కుటుంబాల మధ్య కొన్ని మనస్పర్ధల కారణంగా అమ్మాయి తరపువారు ఇదివరకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే కాలానుక్రమంగా వివాదాలతో సతమతమైన వీరి ప్రేమ కథకు సంతోషకరమైన మలుపు దక్కింది. ఇరువురి కుటుంబాలు తమ మనసు మార్చుకుని సమస్యకు పరిష్కారం చూపించారు. ప్రేమికులకు పెళ్లి జరిపించేందుకు హృదయపూర్వకంగా ముందుకొచ్చారు.
Advertisement
దీంతో యువతి తన ప్రియుడితో వివాహం కోసం ఖుర్దా జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీని సంప్రదించింది. ఈ క్రమంలో జైలులో శిక్ష అనుభవిస్తున్న యువకుడు ప్రియురాలితో పెళ్లి కోసం జైలు అధికారుల ఆధ్వర్యంలో ఖుర్దా జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీని అభ్యర్థించాడు. వీరి అభ్యర్థనపై జైలు, న్యాయ శాఖ అధికార వర్గాలు సానుకూలంగా స్పందించాయి. పెళ్లి తంతుని మరింత ప్రోత్సహించి ముందుకు నడిపించారు. చట్టపరమైన నిబంధనల మేరకు వీరి వివాహాన్ని అత్యంత ఆనందోత్సాహాలతో జరిపించారు.
Also Read : ఎన్నికల తర్వాత దేశంలో UCC అమలు.. అమిత్ షా కామెంట్స్ వైరల్..!