సాధారణంగా మనం ఒకరిని పెళ్లి చేసుకోవాలంటేనే కాస్త ఆలోచిస్తుంటాం. కానీ ఓ వ్యక్తి ఏకంగా ఒకేసారి ఇద్దరినీ పెళ్లి చేసుకోవడం విశేషం. అంతేకాదు.. ఈ వివాహం వారి ముగ్గురి అంగీకారంతోనే జరిగిందట. ఈ ఆశ్చర్యకరమైన ఘటన జార్ఖండ్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. లోహర్దగాలోని భాంద్రాబ్లాక్లోని బండా గ్రామానికి చెందిన సందీప్, కుసుమ్ లక్రా అనే యువతి మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇక వీరికి పెళ్లికి ముందే ఒక బిడ్డ జన్మించడం గమనార్హం.
Advertisement
ఏడాది కిందట సందీప్ ఇటుక బట్టీలో పని చేసేందుకు పశ్చిమబెంగాల్ వలస వెళ్లాడు. వీరి ప్రేమకథ మలుపు తిరిగింది. అక్కడ పని చేయడానికి వచ్చిన స్వాతి కుమారిని సందీప్ పరిచయం చేసుకున్నాడు. వీరి పరిచయం కాస్త స్నేహంగా మారి అది కాస్త ప్రేమగా మారింది. వీరు ఎవరి ఇంటికి వారు తిరిగి వెళ్లిన తరువాత కూడా వీరిద్ధరి మధ్య సంబంధాలు కొనసాగాయి. ఈ విషయం చివరికి కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దల వద్దకు పంచాయితీ తీసుకెళ్లడంతో.. అక్కడ గొడవలు చోటు చేసుకోవడంతో సందీప్ ఇద్దరినీ పెళ్లి చేసుకోవాలని గ్రామ పెద్దలు నిర్ణయించారు.
Advertisement
ఇక యువతులు ఇద్దరి కుటుంబ సభ్యులు కూడా అడ్డు చెప్పకపోవడంతో వీరిద్దరి మెడలో తాళి కట్టి భార్యలుగా స్వీకరించాడు. ఇక పెళ్లి తరువాత సందీప్ మీడియాతో మాట్లాడుతూ ఒకేసారి ఇద్దరు మహిళలను పెళ్లి చేసుకోవడం ద్వారా కొన్ని చట్టపరమైన సమస్యలు ఉండవచ్చు. కానీ నేను వారిద్దరినీ ప్రేమిస్తున్నానని.. వారిని విడిచిపెట్టి ఉండలేనని చెప్పాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Also Read :
ఒక్కడు సినిమాను వదులుకున్న ఆ స్టార్ హీరోయిన్ ఎవరో మీకు తెలుసా..?
జాన్వీకపూర్ తెలుగులో ఏ హీరోతో చేయనుందో తెలుసా..?