సాధారణంగా ముస్లిం మహిళలు బురఖా వేసుకుంటారు. కానీ పురుషులు బురఖా వేసుకోవడం వింటే ఆశ్చర్యమే అనిపిస్తుంది. ఇలాంటి ఘటనే తెలంగాణలో చోటు చేసుకుంది. భార్య తనపై పెట్టిన కట్నం వేదింపుల కేసులో కోర్టు వాయిదాలకు నిందితుడు బుధవారం బురఖా వేసుకొని జిల్లా కోర్టు ఆవరణలో పీసీఆర్ కోర్టుకు హాజరయ్యేందుకు రావడం సంచలనం రేకేత్తించింది.
Advertisement
వివరాల్లోకి వెళ్లితే.. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామానికి చెందిన పల్లె శ్రీనివాసరెడ్డి పై అతని భార్య కట్నం వేదింపుల కేసు పెట్టింది. ఇక వాయిదాల ప్రకారం.. కోర్టుకు హాజరవుతున్నాడు. ఈ సమయంలోనే మధ్యలో ఓ వాయిదాకు హాజరు కాలేదు. కోర్టు అతనిపై వారెంట్ జారీ చేసింది. భార్య తరుపు వారితో ప్రాణభయం ఉండడం వారెంట్ పై పోలీసులు పట్టుకోకుండా ఉండేందుకు బురఖా ధరించి కోర్టుకు వచ్చాడు. కొందరూ గమనించి పోలీసులకు సమాచారం అందించారు.
Advertisement
టూ టౌన్ పోలీసులు శ్రీనివాస్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఇతనికి తోడుగా తండ్రి, చెల్లి వచ్చారు. పోలీసులు అరెస్ట్ చేయడంతో తండ్రి మల్లారెడ్డి వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి కిందపడిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆ తరువాత తనపై ఉన్న వారెంట్ ను తొలగిచుకునేందుకు శ్రీనివాసరెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకోగా కోర్టు అనుమతి ఇచ్చింది. తన భార్య తప్పుడు కేసు పెట్టి ఇబ్బందికి గురి చేస్తుందని ప్రాణభయం ఉండడంతో ఇలా బురఖా ధరించి వచ్చాడు అని శ్రీనివాసరెడ్డి ఏడవడం కలవరపరిచింది.
Also Read :
ప్రముఖ నటి మీనా కుమారి భర్త కూడా టాలీవుడ్ స్టార్ నటుడని మీకు తెలుసా..?