ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్ వస్తోంది. ఆ ఫీచర్ పేరు Whatapp Self Chat. ఈ ఫీచర్ ద్వారా మీ స్నేహితులు, ఇతర కాంటాక్టులకు మాత్రమే కాకుండా సెల్ప్ చాట్ లో కూడా మెసేజ్ లను పంపించేందుకు అనుమతిస్తుంది వాట్సాప్. అదేవిధంగా వాట్సాప్ లో నోట్స్ రాసుకోవడానికి కూడా ఈ కొత్త ఫీచర్ ని ఉపయోగించవచ్చు. ఇప్పటివరకు ఇలాంటి ఫీచర్ ని అధికారికంగా ప్రవేశపెట్టలేదు. కానీ ఇప్పుడు ‘message yourself’ అనే కొత్త ఫీచర్ ని ఆవిష్కరించింది.
Advertisement
ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమకు తాముగా నోట్స్ పంపించుకోవచ్చు. ఇతర యూజర్లకు రిమైండర్లను ప్లాన్ చేసుకోవచ్చు. నూతన ‘message yourself’ ఫీచర్ ద్వారా వాట్సాప్ యూజర్లు తాము చేయాల్సిన పనులను ట్రాక్ చేయవచ్చు. నోట్స్, రిమైండర్లు, షాపింగ్ లిస్టులను తదితర వాటిని పంపించుకోవచ్చు. ఇక ఈ ఫీచర్ రాబోయే నెలలో దశల వారిగా ఆండ్రాయిడ్, iOS యూజర్లకు అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్ ని పొందాలనుకుంటే వాట్సాప్ యాప్ అప్ డేట్ చేయాలి. యాప్ లేటెస్ట్ వెర్షన్ కి అప్ డేట్ అయిన తరువాత ఇలా ఫాలో కావాలి.
Also Read : ఈ 3 లక్షణాలున్న అమ్మాయిని అస్సలు పెళ్లి చేసుకోరాదు.. కారణం ఇదే..!!
Advertisement
వాట్సాప్ మెసేజ్ మీకు మీరే పంపుకోవడం ఎలా ?
- యాప్ అప్ డేట్ అయిన తరువాత ఫోన్ లో మీ వాట్సాప్ ని ఓపెన్ చేయాలి. ఆ తరువాత కొత్త చాట్ ని క్రియేట్ చేయండి. అందులో మీ కాంటాక్టును లిస్టు ఫైన చూడవచ్చు.
- ఇక వాట్సాప్ ఫీచర్ అందుబాటులో ఉందో లేదో చెక్ చేసుకోండి
- మీ కోసం అప్ డేట్ రిలీజ్ కావడానికి మీరు మరికొన్ని రోజులు వేచి ఉండాల్సి ఉంటుంది.
- అప్ డేట్ మీకు అందుబాటులో ఉంటే మీ నంబర్ పై క్లిక్ చేసి, మెసేజ్ పంపించుకోవచ్చు.
- ఇటీవల వాట్సాప్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఫీచర్లలో ఒక దానిని ఆవిష్కరించింది. దీనిని ‘hide online status’ అంటారు. ఈ ప్రైవసీ ఫీచర్ యూజర్ లు తమ ఆన్ లైన్ స్టేటస్ ని ఎవరికీ కావాలంటే వారి నుంచి హైడ్ చేసి సీక్రెట్ గా చాట్ చేసేందుకు అనుమతిస్తుంది.
- ఈ ఫీచర్ యూజర్లు తమ ఆన్ లైన్ స్టేటస్ అందరి నుంచి హైడ్ చేయడానికి లేదా కాంటాక్టులను ఎంచుకోవడానికి అనుమతిస్తుంది.
- Hide Online Status ఫీచర్ iOS, Android యూజర్లకు అందుబాటులో ఉంది. ఇప్పటికీ మీరు అప్ డేట్ ని అందుకోలేదంటే.. యాప్ స్టోర్ కి వెళ్లి వాట్సాప్ యాప్ ని లెటెస్ట్ వెర్షన్ కి అప్ డేట్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం.
Also Read : యాదమ్మ రాజుకి కాబోయే భార్య బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా ?