ఓ వైపు యూకేపై యూనిస్ తుఫాన్ విరుచుకుపడుతోంది. ఈదురు గాలులతో తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. గంటకు ఏకంగా 100 కీ.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తుండడంతో జనం చిన్నాభిన్నమవుతున్నారు. పెద్ద చెట్లు సైతం కూలిపోతున్నాయి. ఈ గాలుల ధాటికి విమానాలు సైతం గాలిపటాల మాదిరిగా ఊగిపోతున్నాయి. తుఫాన్ కారణంగా 436 విమానాల సర్వీస్‌లను అధికారులు తాత్కాలికంగా రద్దు చేసారు. అట్లాంటిక్‌లో ఏర్పడిన యూనిస్ తుఫాన్ జెట్ స్ట్రీమ్ ద్వారా అజోర్స్ నుండి యూరప్ వైపు దూసుకెళ్లింది.
Also Read : Bheemla Nayak Dialogues Telugu
Advertisement
ఇప్పుడు ఈ తుఫాన్ సృష్టిస్తున్న బీభత్సానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ తరుణంలోనే ఇలాంటి ఓ వీడియో వీక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. తుఫాన్ ఏ స్థాయిలో ఉన్నదో కనిపిస్తుంది. యూకేలోనీ వీధుల్లో ఓ బస్సు వేగంగా వెళ్లుతుంది. ఆ సమయంలో గాలులు విపరీతంగా వీయడంతో దీంతో రోడ్డు పక్కన ఉన్న ఓ పెద్ద వృక్షం ఒక్కసారిగా కూలిపోయింది. అటుగా వెళ్తునన బస్సు ముందు భాగంపై వృక్షం పడింది.
Advertisement
Also Read : ప్రపంచ నెంబర్ వన్ ఆటగాడిని ముప్పుతిప్పలు పెట్టిన 16 ఏళ్ల భారత కుర్రాడు
ఆ బస్సు అద్దాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. చెట్టు బస్సు ముందు భాగంలో పడడంతో పెద్దగా నష్టం జరగలేదు. కానీ ఒక వేళ మధ్యలో పడిఉంటే మాత్రం ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండేది. ఒకందుకు ఇది అదృష్టమే అనుకోవాలి. ఇదంతా ఎదురుగా వస్తున్న మరొక వాహనంలో ఉన్న కెమెరాలో రికార్డు అయింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే క్షణాల్లో వైరల్ గా మారింది. ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియోను చూసేయండి.