ఆర్ ఆర్ ఆర్.. సినిమా కోసం ఎంతో మంది ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్.. రామ్ చరణ్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిస్తున్నారు టాలీవుడ్ సంచలన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ పనిలో ఫుల్ బిజీగా అయిపోయింది.
ఈ నేపథ్యంలోనే ఇవ్వాళ హైదరాబాద్ లో మీడియా సమావేశం నిర్వహించింది త్రిబుల్ ఆర్ చిత్రబృందం. షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ మరియు చరణ్ సరదాగా గొడవ పడుతూ ఉంటారని ఇప్పటికే రాజమౌళి చెప్పారు. అయితే ఇవాళ జరిగిన ప్రెస్ మీట్ లో కూడా ఒక ఫన్నీ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది.
ఎన్టీఆర్ మరియు చరణ్ కలిసి ఫోటో దిగుతున్న సమయంలో ఎవరికీ కనపడకుండా ఎన్టీఆర్ రామ్ చరణ్ గిల్లాడు. దీంతో ఎన్టీఆర్ ఒక్కసారిగా ఉలిక్కిపడి దూరం జరిగాడు. రామ్చరణ్ తనకు ఏమీ తెలియదు అన్నట్టుగా చూశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు.. తమకు నచ్చిన కామెంట్లు పెట్టుకుంటున్నారు.
E bromance endi.. 😂🤣 pic.twitter.com/77zv28Q5W2
— Kumar 🙂 (@MSKumar143) December 11, 2021