Home » Hanuman Movie : టాలీవుడ్ యంగ్ హీరోకు గిఫ్ట్ గా డైమండ్ రింగ్ !

Hanuman Movie : టాలీవుడ్ యంగ్ హీరోకు గిఫ్ట్ గా డైమండ్ రింగ్ !

by Bunty

తేజ సజ్జా ఇతని గురించి తెలియనివారంటూ ఉండరు. అతిచిన్న వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఇతను ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా రాణిస్తున్నాడు. తాజాగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో పాన్ ఇండియన్ మూవీ “హనుమాన్” సినిమాలో హీరోగా నటించారు. ఈ మూవీ టీజర్, ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటుంది. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

A diamond ring as a gift for Teja Sajja

భారీ బడ్జెట్ తో తెరకెక్కించే ఈ సినిమా తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మలయాళం, కొరియన్, చైనీస్, జపనీస్, స్పానిష్, కన్నడ, తమిళ భాషల్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తేజకు ఓ డైమండ్ రింగ్ ను గిఫ్ట్ గా ఇచ్చారు ప్రొడ్యూసర్ అభిషేక్ అగర్వాల్. సినిమా ఇండస్ట్రీలో గిఫ్టులు ఇచ్చుకోవడం చాలా కామన్.

కానీ వారు ఇచ్చే గిఫ్ట్ ను బట్టి ఎదుటివారి గొప్పతనం మనకు అర్థమవుతుంది. తన బ్యానర్ లో ఎన్నో మంచిచిత్రాలు తీసిన అభిషేక్ తన ప్రొడక్షన్ లో కాకుండా వేరే ప్రొడక్షన్ లో హీరోగా చేసిన తేజకు ఇలాంటి కాస్ట్లీ గిఫ్ట్ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక హనుమాన్ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. తేజ సజ్జాకి ఈ సినిమా హిట్ ఇస్తుందా…. లేక ఫ్లాప్ ఇస్తుందా…. అని ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading