ఇటీవల సూపర్ స్టార్ కృష్ణ మరణించిన సంగతి తెలిసిందే. దీంతో టాలీవుడ్ మొత్తం విషాదంలోకి వెళ్లింది. అయితే, కృష్ణ తన కెరీర్ లో 350 సినిమాల్లో నటించారు. నిర్మాతల హీరో అనే పేరు ఉన్నప్పటికీ ఆస్తులను సైతం బాగానే కూడబెట్టారు. ఆయన పేరు మీద చాలా ఆస్తులతో పాటు, వందల ఎకరాల్లో భూములు ఉన్నాయి. హైదరాబాదులో చెన్నై నుంచి వచ్చాక సొంత సినిమాల షూటింగ్ కోసం పద్మాలయ స్టూడియో నిర్మించుకున్నాడు.
READ ALSO : పవన్ కళ్యాణ్ వాహనానికి “వారాహి” పేరు ఎందుకు పెట్టారు.. అసలు దాని వెనుక ఉన్న రహస్యం ఏంటీ ?
Advertisement
అది ప్రస్తుతం సినిమా షూటింగ్స్ చేసుకోవడం లేదు. అయితే అందులో ఉన్న ఎన్నో ఎకరాల భూమిని అపార్ట్మెంట్స్ కట్టడానికి, కమర్షియల్ కాంప్లెక్స్ ల కోసం కృష్ణ తీసేసాడని వార్తలు వస్తున్నాయి. కొంత భాగం ఇలా పోయినప్పటికీ ఇంకా 5 ఎకరాల స్థలం మిగిలి ఉందట. ఇక పద్మాలయ స్టూడియోస్ అమ్మగా వచ్చిన డబ్బుతో దానికి ప్రత్యామ్నాయంగా ఆ ప్రాంతానికి అతి సమీపంలో మహేశ్వరం ఏరియాలో కొన్ని ఎకరాల స్థలాన్ని కృష్ణ కొనుగోలు చేశాడు. ఇది ఇలా ఉండగా, ఒకసారి మొక్కులు తీర్చుకోవడానికి తిరుపతికి వెళ్ళాడు సూపర్ స్టార్ కృష్ణ.
Advertisement
ఈ సందర్భంగా తలనీలాలు సమర్పించి, తన ఇంటి నుంచి పద్మాలయ స్టూడియోకు తాను సొంతంగా కారు డ్రైవ్ చేసుకుంటూ వెళుతుండగా, స్టూడియో దగ్గరకు చేరుకుంటున్న సమయంలో కారు ఆగిపోతే దగ్గరే కదా అని స్టూడియోలోకి నడుచుకుంటూ వెళ్లారు. ఆ సమయంలో అక్కడ ఉన్న వాచ్మెన్ కృష్ణను ఎప్పుడు అలా చూడకపోవడంతో ఎవరో అనుకొని స్టూడియో లోపలికి పంపించడానికి నిరాకరించాడు. పైగా వాచ్ మెన్ కు తెలుగు రాకపోవడం కారణంగా గేటు దగ్గర అలాగే నిలుచుండిపోయారట. కొద్దిసేపటికి స్టూడియో మేనేజర్ వచ్చి, పరిస్థితి గమనించి కృష్ణను లోపలికి తీసుకువెళ్లారట. ఆ తర్వాత ఆ వాచ్మెన్ పని తీరు మెచ్చి అతడిని ఆయన అభినందించారు.
Read also : 17, 18 ఏళ్లకే పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్లు !