Home » చిరు, బాలయ్యలో ఉన్న కామన్ పాయింట్.. తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే..?

చిరు, బాలయ్యలో ఉన్న కామన్ పాయింట్.. తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే..?

by Sravanthi
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఈ ఇద్దరు హీరోలు పెద్దన్నలాంటివారే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరికీ చెప్పుకోదగ్గ ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటి వీరిద్దరూ ఇండస్ట్రీలో ఎన్నోసార్లు వారి వారి సినిమాలతో పోటీపడ్డారు. ఈ పోటీలో ఓసారి చిరంజీవి పై చేయి సాధిస్తే, మరోసారి బాలకృష్ణ పై చేయి సాధిస్తూ ఉంటారు. ఇదంతా ఇండస్ట్రీలో కామనే కానీ చిరు మరియు బాలకృష్ణ మధ్య ఒక కామన్ పాయింట్ మాత్రం ఉందని చెప్పవచ్చు అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. సాధారణంగా ఈ ఇద్దరు హీరోలు స్టార్ హీరోలుగా ఎదగడానికి కారణం వారి కుటుంబాలు అని చెప్పవచ్చు.

Advertisement

also read:మ్యూచ్ వల్ ఫండ్స్ లో ఫిబ్రవరి 01 నుంచి సరికొత్త రూల్స్..!

వీరు షూటింగ్ ల పేరిట 24 గంటలు బయట పనిచేస్తూ ఉంటే వీరి యొక్క కుటుంబాన్ని, పిల్లలను పెంచే బాధ్యత వారి భార్యలపైనే ఉంటుంది. వారి ఇంటి వద్ద చూసుకుంటున్నారు కాబట్టి వీరు బయట హ్యాపీగా షూటింగ్లోకి వెళ్లి వస్తున్నారు. అందుకే ఇద్దరు స్టార్ హీరోలుగా ఎదిగారు. ఇక బాలకృష్ణ చిరంజీవి ఈ విషయాల్లో చాలా లక్కీ హీరోలు అని చెప్పవచ్చు. బాలకృష్ణ భార్య వసుంధర, చిరంజీవి భార్య సురేఖలో ఒక కామన్ పాయింట్ ఉంది. ముఖ్యంగా చిరంజీవి భార్య సురేఖ ఒక ఉమ్మడి కుటుంబానికి చెందిన మహిళ. ఆమె కుటుంబ బరువు బాధ్యతలు, బంధాలు అన్నీ తెలుసు. ఆమె ఇంట్లో వాళ్ళ అందరితో, ఇంటి చుట్టుపక్కల వారితో బంధువులతో అభిమానులు ఎవరు వచ్చినా వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకునేదట.

Advertisement

ముఖ్యంగా ఎవరైనా ఆకలితో వస్తే వారికి తప్పనిసరిగా కడుపు నింపి మరీ పంపెదట. ఈ విధంగా చిరంజీవి షూటింగులో ఉన్నప్పుడు ఆయనకు సంబంధించిన వ్యవహారాలన్నీ సురేఖ దగ్గర ఉండి చూసుకున్నారు కాబట్టి చిరంజీవి పూర్తిగా సినిమాలపై ఫోకస్ పెట్టగలిగారు. ఇక బాలకృష్ణ భార్య వసుంధర ఏ మాత్రం తక్కువ కాదు. నందమూరి ఫ్యామిలీ పరువు నిలబెట్టే మహిళగా పేరు తెచ్చుకుంది. తన ఇంటికి బంధువులు, అభిమానులు, ఎవరు వచ్చినా సరే వారికి ఎలాంటి లోటు రాకుండా చక్కగా చూసుకుంటుందట. వసుంధర బాలకృష్ణకు భార్యగా దొరకడం ఆయన అదృష్టం అని చెప్పవచ్చు. ఈ విధంగా చిరంజీవి బాలకృష్ణ భార్యలు వారికి ఎప్పుడూ సపోర్ట్ గా ఉంటారని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

also read:

Visitors Are Also Reading