సాధారణంగా అందరి జీవితం ఒకేవిధంగా ఉండదు. కొంత మంది ధనవంతులు అయితే.. మరికొందరూ పేదవాళ్లు అవుతుంటారు. ఒక్కొక్కరి జీవితం ఒక్కో మాదిరిగా ఉంటుంది. కొందరి జాతకాల్లో దోషాలు అనేవి చాలా ఉంటాయి. ఆ దోషాల నుంచి తప్పించుకోవడానికి కొన్ని పూజలు, హోమాలు చేస్తుంటారు. ముఖ్యంగా ఇలాంటి దోషాలు సినీ ఇండస్ట్రీకి చెందిన వారు ఎక్కువగా నమ్ముతుంటారు. వారి జాతకంలో ఏదైనా దోషం ఉందని తెలిస్తే చాలు.. ఇక వారు వెంటనే ఎక్కడికంటే అక్కడికెళ్లి ప్రత్యేక పూజలు చేయించుకుంటారు. కొంతమందికి తీరని దోషాలు కూడా ఉంటుంటాయి. ఇప్పుడు హీరోయిన్ అనుష్క జాతకంలో కూడా అలాంటి దోషం ఒకటి ఉన్నట్టు తెలుస్తోంది.
Also Read : Pushpa 2 : పుష్ప 2 లోనూ సమంత ఐటెం సాంగ్ ?
Advertisement
ప్రధానంగా అనుష్కకి పెళ్లి జరిగితే ఇక అంతే సంగతి అని అర్థమవుతోంది. తెలుగు ప్రేక్షకులకు అనుష్క గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఒకప్పటి అభిమానులకే కాకుండా ఇప్పటి ప్రేక్షకులకు కూడా ఆమె క్రష్ అనే చెప్పాలి. అనుష్క అందాన్ని చూసి స్టార్ హీరోలు సైతం ఫిదా అవుతుంటారు. ఈమెకు తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి అభిమానం ఉంది. అనుష్క తెలుగు సినీ ఇండస్ట్రీకి మొదటిసారిగా సూపర్ సినిమాతో పరిచయమైంది.
మొదటిసారి నటనతోనే కాకుండా తన అందాల గ్లామర్ ని కూడా పరిచయం చేసింది. ఇక ఆ తరువాత వెనుతిరిగి చూడకుండా ఓరేంజ్ లో దూసుకెళ్లింది. ఈమె నటించిన అరుంధతి చిత్రం ఎంతటి క్రేజ్ సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. తెలుగుతో పాటు తమిళ ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్టి పలు సినిమాల్లో నటించింది. ఆ తరువాత అనుష్కకి ఎందుకో అంతగా కలిసి రాలేదు. పలు సినిమాలు ఆమెను నిరాశ పరిచాయి.
Advertisement
Also Read : వెట్రీమారన్ దర్శకత్వంలో ఎన్టీఆర్-బన్నీ సినిమా.. ఎప్పుడంటే?
ఒకప్పుడు వచ్చినన్ని అవకాశాలు ఇప్పుడు ఆమెకు రావడం లేదు. గతంలో కొద్ది రోజులు సినిమాలకు గుడ్ బై కూడా చెప్పేసింది. ఆ తరువాత మళ్లీ అవకాశాలను అందిపుచ్చుకొని విభిన్న పాత్రలు చేస్తూ వస్తుంది.టాలీవుడ్ ఇండస్ట్రీలో అనుష్క మంచి స్టార్ హీరోయిన్ గా ఎదిగినప్పటి నుంచి తన పెళ్లి గురించి ఎన్నో ప్రశ్నలు ఎదురయ్యాయి. ఎంతో మంది చాలా ఇంటర్వ్యూలలో పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు అని అనుష్కను ప్రశ్నించారు. అనుష్క మాత్రం సెటిల్ అయిన తరువాతనే పెళ్లి చెప్పి తప్పించుకునేది. గతంలో ప్రభాస్ ని కూడా పెళ్లి చేసుకుంటుందని వారి మధ్య లవ్ నడుస్తుందని ఎన్నో రూమర్స్ వినిపించాయి.
మరోవైపు అనుష్క పెళ్లి చేసుకోకపోవడానికి కూడా ఓ కారణం ఉన్నట్టు తెలుస్తోంది. ఆమె జాతకంలో ఓ పెద్ద దోషం ఉందట. ఆ దోషానికి పరిహారాలు చేసినప్పటికీ ఆమె కోలుకోలేని దెబ్బ తినాల్సి వస్తుందట. అందుకే అనుష్క పెళ్లి చేసుకోవడం లేదని టాక్ వినిపిస్తోంది. తన లైఫ్ లోకి వచ్చే అబ్బాయి కూడా చాలా హ్యాపీగా ఉండాలని.. తన వల్ల ఎలాంటి ఇబ్బందులు పడకూడదని వచ్చే వారి గురించి ఆలోచిస్తూ పెళ్లినే వదిలేసుకుందని సమాచారం. ఇక ఈ విషయం తెలిసిన కొందరూ అనుష్క మనస్సు ఎంత గొప్పదో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరూ అనుష్క ఎప్పుడూ ఒంటరిగానే ఉండాలా అంటూ బాధపడుతున్నారు. ఇందులో వాస్తవం ఎంతో అనేది అధికారికంగా ప్రకటిస్తే కానీ తెలియదు.
Also Read : మెగా ఇంట్లో బిడ్డ పుడితే ఉపాసనకు పరిస్థితి దారుణమేనట..!!