మనం స్టవ్ మీద పాలు పెట్టి, ఏదైనా పని చేసుకున్నప్పుడు పాలు పొంగిపోయి కింద పడిపోతూ ఉంటాయి. దానిని క్లీన్ చేసుకోవడం పెద్ద సమస్య. పైగా పాలు కూడా వృధాగా పోయాయని బాధ కలుగుతుంది. కొన్ని చిన్న చిన్న ఇంటి చిట్కాలని కనుక పాటించినట్లయితే ఇటువంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి. పాలు కనుక పొంగిపోకుండా ఉండాలంటే, పాలు కాగే సమయంలో గిన్నె మీద చెంచా పెట్టండి ఒక చెక్క చెంచాన్ని పెడితే అసలు పాలు పొంగవు అని గుర్తుపెట్టుకోండి. ఈసారి పాలని స్టవ్ మీద పెట్టినప్పుడు ఈ విషయాన్ని కచ్చితంగా పాటించండి.
Advertisement
Advertisement
డ్రై ఫ్రూట్స్ నిల్వ ఉండడానికి ఒక జిప్ లాక్ బ్యాగ్ తీసుకుని అందులో మీరు డ్రై ఫ్రూట్స్ ని స్టోర్ చేసి ఫ్రిజ్లో పెట్టినట్లయితే డ్రైఫ్రూట్స్ ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. శనగల్ని ఉడకపెట్టేటప్పుడు కొన్ని టీ ఆకుల్ని మూట కట్టి వేస్తే రెస్టారెంట్ స్టైల్ లో వస్తుంది. కూర చేసుకున్నా కూడా బాగుంటుంది. ఉల్లిపాయలు బంగారం రంగులో వేగాలంటే ఉల్లిపాయ ముక్కల్ని వేయించే టైంలో ఉప్పు కానీ చక్కెర కానీ వేయండి అప్పుడు బంగారం రంగులోకి ఉల్లిపాయ ముక్కలు వస్తాయి. ఈ చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే వంట బాగా వస్తుంది ఇటువంటి వంటింటి చిట్కాలని ఫాలో అయితే మనం కుకింగ్ స్కిల్స్ ని కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు,
Also read:
- ఈ మసాలానని తీసుకుంటే.. ఊపిరితిత్తులు క్లీన్ అయిపోతాయి…!
- Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి వ్యాపారంలో లాభాలుంటాయి
- కేటీఆర్ ను ఓడించేందుకు డబ్బులు పంపించిన జగన్..?