రోజువారి వ్యాయామాలు ఏ సమయంలో చేయాలన్న దానిపై సర్వత్రా చర్చ నిరంతరం ఉంటుంది. కొంతమంది ఫిట్ నెస్ నిపుణులు ఉదయం పూట వ్యాయామాలు చేయటం ఉత్తమమని సిఫార్సు చేస్తుండగా మరికొందరు సాయంత్రం వర్కౌట్ లు మంచి ఫలితాలు ఇస్తాయని చెబుతున్నారు. వ్యాయామం చేయటంలో ఈ రెండు సమయాలు మంచివే అయినప్పటికీ సాయంత్రం వ్యాయామం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
ఒత్తిడి తగ్గించడానికి: సాయంత్రం సమయంలో వ్యాయామాలు చేయటం వల్ల రోజంతా శరీరం ఎదుర్కొన్న ఒత్తిడి స్థాయిని తగ్గించుకోవచ్చు. సాయంత్రం వర్కౌట్ లు ఒత్తిడిని తగ్గించేందుకు సహాయపడతాయి. అంతేకాకుండా రాత్రి మంచి నిద్ర పట్టేలా చేస్తాయి.శరీర కండరాల్లో సడలింపు: పగలంతా ఎక్కువసేపు కూర్చొని ఉండటం వల్ల శరీర కండరాలు గట్టిగా మారతాయి. సాయంత్రం సమయంలో వ్యాయామాలు చేయటం వల్ల టెన్షన్ కు దూరమై శరీరం తేలికగా మారుతుంది. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల శరీరం నిద్ర పట్టే సామర్థ్యాన్ని కోల్పోతుంది. సాయంత్రం సమయంలో మితమైన వ్యాయామం కండరాలకు రిలాక్సేషన్ ఇవ్వటం ద్వారా నిద్ర పట్లా చేస్తుంది.
Advertisement
పగలంతా పని కార్యకలాపాల వల్ల చాలామందికి వ్యాయామాలు చేయటానికి సమయం కుదరదు. అయితే సాయంత్రం వేళల్లో వ్యాయామానికి ఎక్కువ సమయం కేటాయించవచ్చు. ఆఫీసు కార్యకలాపాలు ముగించుకుని ఇంటికి వచ్చాక వ్యాయామాలపై దృష్టి సారించవచ్చు. ఉదయం చేసే వ్యాయామాల కన్నా సాయంత్రం సమయంలో వ్యాయామాలను ఉత్సాహంగా చేసేందుకు అవకాశం ఉంటుంది. సాయంత్రం సమయంలో కార్యకలాపాలు అన్ని ముగియటం వల్ల ప్రశాంతంగా ఉంటారు. కాబట్టి ఆ సమయంలో వ్యాయామాలు చేయటం వల్ల తరువాతి రోజు పనిపై ఎక్కువ దృష్టి పెట్టటానికి అవకాశం ఉంటుంది.
2022 అధ్యయనం ప్రకారం, సాయంత్రం వ్యాయామాలు పురుషులకు బాగా మేలు చేస్తాయి. ఎందుకంటే కొవ్వును కరిగించడంలో సహాయపడతాయి. రక్తపోటు నియంత్రణకు మెరుగుపరుస్తాయి. మహిళల్లో కండరాల పనితీరును పెంచుతాయి. వ్యాయామం మహిళల్లో పొత్తికడుపు కొవ్వు, రక్తపోటును తగ్గిస్తుంది. సాయంత్రం వ్యాయామం స్త్రీలలో కండరాల పనితీరును పెంచుతుంది.చివరిగా చెప్పాలంటే వ్యాయామాలు చేసేందుకు ఖచ్చితమైన సమయం ఏమీ లేకపోయినాప్పటికీ అనుకూలమైన సమయంపైనే ఆధారపడి ఉంటుంది. అయితే వ్యాయామాలు చేసే ముందు ఫిట్ నెస్ ట్రైనర్ ను సంప్రదించి సూచనలు, సలహాలు తీసుకోవటం మంచిది.