బాలీవుడ్ లో సీనియర్ హీరోలలో అమితాబ్ బచ్చన్ ఎంతటి పేరు సంపాదించుకున్నారో మనందరికీ తెలుసు. ఈయన పేరు కేవలం బాలీవుడ్ లోనే కాకుండా, దేశవ్యాప్తంగా తెలియని వారు ఉండరు. 1970లో తన సినీ కెరియర్ ప్రారంభించిన ఆయన దాదాపు 40 సంవత్సరాలకు పైగా సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతూ వస్తున్నారు. అమితాబ్ బచ్చన్ ప్రయాగ్ రాజ్ లో అక్టోబర్ 11, 1942లో జన్మించారు . ఈరోజుకు ఆయన 81 వసంతంలోకి అడుగు పెట్టిన సందర్భంగా కొన్ని విషయాలు తెలుసుకుందాం.
Advertisement
అమితాబ్ బచ్చన్ 1970లో రిలీజ్ అయిన బంజీర్, దివార్ సినిమాలతో మంచి గుర్తింపు సాధించారు. ఆ తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు. తన సినీ కెరియర్ మొత్తంలో ఎన్నో సినిమాల్లో నటించి కోట్లాది రూపాయల సంపాదించారు.కేవలం 500 రూపాయలతో తన కెరీర్ ప్రారంభించిన అమితాబ్ , వేలాది కోట్లకు అధిపతి అయ్యారు. ప్రస్తుతం మార్కెట్ అంచనా ప్రకారం ఆయన ఆస్తుల విలువ రూ:4000 కోట్లకు పైగానే ఉంటుందట. తాజాగా ఆయన ఒక సినిమాలో నటించడానికి 5 నుంచి 10 కోట్ల వరకు పారితోషకంగా అందుకుంటున్నారు. ఇక వ్యాపార ప్రకటనలు మినిమం 5 కోట్లకి పైగానే ఉంటుంది. కాకుండా పలు స్టార్ట్ అప్ వ్యాపారాల్లో కూడా డబ్బును పెట్టుబడి పెట్టి ఆయన లాభాలు అర్జీస్తున్నారట.
Advertisement
ఈ విధంగా సినిమాలు ప్రకటనతో, ఈ వయసులో కూడా కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు అమితాబ్. అంతేకాకుండా అమితాబ్ బచ్చన్ ముంబై జూహు ప్రాంతంలో కొన్ని ఖరీదైన బంగ్లాలు, వీటి విలువ వందల కోట్లకు పైగానే ఉంటుందట. ఇలాంటి బంగ్లాలు ముంబై నగరంలో మూడు నుంచి నాలుగు ఉన్నాయట. వీటి విలువ కూడా కోట్ల రూపాయలు ఉంటుందని, అంతేకాకుండా కంపెనీలకు చెందిన లగ్జరీ కార్లు పదికి పైగానే ఉన్నాయట. ఈ విధంగా ఆయనకున్న ఆస్తులు, వ్యాపారాలు మొత్తం కలిపి రూ:4000 కోట్లకు పైగానే ఉంటుందని అంటున్నారు.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
బాహుబలి సినిమా కోసం ప్రభాస్ అలాంటి కండిషన్స్ పెట్టారా..? రాజమౌళి ఏం చెప్పారంటే..?
శ్రీదేవి డెత్ మిస్టరీని కనిపెట్టిన వైద్యులు.. అలా జరిగిందా ?