ప్రముఖ టాలీవుడ్ ఎడిటర్లలో మార్తాండ్ కే. వెంకటేష్ ఒకరు. చాలా సినిమాలకు ఆయన ఎడిటర్ గా పని చేశారు. ఇటీవలే ఆయన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. షాపింగ్ విషయాలను వెల్లడించారు. ప్రీ ప్రొడక్షన్ లో నేను జోక్యం చేసుకోనని ఆయన తెలిపారు. ప్రీ ప్రొడక్షన్ లో నిర్మాత, దర్శకునికి కథ నచ్చిన తర్వాత నేను కథ బాలేదని చెబితే సినిమా ఆగిపోతుందని.. అందువల్ల ఆ సమయంలో ఎవరూ ఓపెన్ ఒపీనియన్ చెప్పారని సినిమా మొదలైన తర్వాత అనుగుణంగా మార్పులు చేస్తారని ఆయన కామెంట్స్ చేశారు. కథ వినకుండా ఎడిట్ చేస్తే ఫీలింగ్ బాగుంటుందని మార్తాండ్ కె వెంకటేష్ చెప్పుకొచ్చారు.
Advertisement
శేఖర్ కమ్ముల సినిమా 20 నిమిషాలు చెప్పారని.. అయితే ఆయన చెప్పిన దానితో పోలిస్తే ఎన్నో రెట్లు బెటర్ గా సినిమా ఉందని మార్తాండ్ కె.వెంకటేష్ చెప్పుకొచ్చారు. ఎడిట్ రూమ్ లో ఎంత గొడవ జరిగితే అంత మంచి సినిమా అవుతుందని ఆయన కామెంట్స్ చేశారు. ఒక హీరో సినిమాను మధ్యలోనే వదిలేయాల్సి వచ్చిందని మార్తాండ్ కే.వెంకటేష్ వెల్లడించారు. ఒక హీరోకు సంబంధించి వరుసగా రెండు, మూడు సినిమాలకు తాను పని చేశానని ఆ సినిమాలు కూడా సక్సెస్ సాధించాయని ఆయన చెప్పుకొచ్చారు. ఆ హీరో చిన్న హీరో అని.. హిట్ల వల్ల మార్కెట్ పెరిగిందని చెప్పుకొచ్చారు మార్తాండ్ వెంకటేష్
Advertisement
ఆ చిన్న హీరో తనను పలకరించలేదని విష్ చేయలేదని తన సినిమాకు ఎడిటర్ గా వద్దన్నారని నేను కూడా ఓకే చెప్పి వెళ్లిపోయానని మార్తాండ్ కే.వెంకటేష్ తెలిపారు. ఆ సినిమాకు సంబంధించి 45 నిమిషాల పాటు గొడవ జరిగిందని ఆయన కామెంట్లు చేశారు. మేము హీరోలను విష్ చేసి వాళ్ళు రియాక్షన్ ఇవ్వకపోతే హర్ట్ అవుతామని మార్తాండ్ కే.వెంకటేష్ వెల్లడించారు. అన్నపూర్ణ స్టూడియోస్ లో నేను 1999 నుంచి ఉన్నానని ఆయన చెప్పుకొచ్చారు. మార్తాండ్ కే.వెంకటేశ్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
వైరల్ గా మారుతున్న వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి ఫ్రీ వెడ్డింగ్ ఫొటోస్.. !!