ఇతను ఒక కతర్నాక్ దొంగ. చోరీలు చేయడంలో దిట్ట. చోరి చోరి కి వీడికి ఒక స్టైల్. తొలుత చుట్టూ ఉన్న వాతావరణ పరిస్థితులను అన్నింటిని గమనిస్తాడు. ఆ తర్వాత సరైన సమయంలో స్కెచ్ వేసి చోరీ చేస్తాడు. ఏమిటి ఇదంతా ఎందుకు చెబుతున్నాను అని అనుకుంటున్నారా..? తాజాగా ఒక వ్యక్తి చేసిన దొంగతనం వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దానిని చూసిన మీరు కూడా వామ్మో ఈ సీన్ ఊహించలేదని.. సినిమాల మాదిరిగానే ఉందని అంటారు. అందుకే ఓసారి ఆ వీడియో గురించి చూద్దాం.
Advertisement
Advertisement
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఒక రైల్వే స్టేషన్ కు సంబంధించింది. అయితే స్టేషన్లో రైలు అప్పుడే ఆగిఉంది. ఆ రైలు డోర్ దగ్గర ఓ వ్యక్తి నిలబడి ఫోన్ మాట్లాడుతున్నాడు. రైల్వే స్టేషన్లో రద్దీ లేకపోయినా ఆ వ్యక్తి దగ్గర లో మాత్రం చాలా మంది ఉన్నారు. ఇక ముఖానికి కర్చీప్ కట్టుకుని ఆవ్యక్తి అప్పుడే రైలు ఎక్కుతాడు. రైలు కదులుతున్న సందర్భంలో అసలు కథ అప్పుడే మొదలవుతుంది.
కర్చీఫ్ కట్టుకున్న వ్యక్తి అప్పుడే రన్నింగ్ ట్రైన్ నడుచుకుంటూ వచ్చి ఆ వ్యక్తి చేతుల్లో నుంచి మొబైల్ ఫోన్ లాక్కొని పారిపోతాడు. ప్రస్తుతం ఈ మొబైల్ ఫోన్ కు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వీడియోని చూసి ‘haq_se_engineers’ అని ఇన్‌స్టా పేజీ అప్లోడ్ చేయగా ఇప్పటివరకు సుమారు 70 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. రైలు సీన్ అసలు ఎవరూ ఊహించలేదు అని ఒకరు కామెంట్ చేయగా.. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం అంటే ఇదేనేమో అని పలువురు కామెంట్లతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.