Home » బేబీ మూవీ బాలీవుడ్ లో రీమేక్ అవుతుందా ? క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

బేబీ మూవీ బాలీవుడ్ లో రీమేక్ అవుతుందా ? క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

by Anji
Ad

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ, హీరోయిన్ వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన బేబీ గురించి దాదాపు అందరికీ తెలిసిందే. మీడియం రేంజ్ మూవీగా విడుదలైన ఈ సినిమా ఈ ఏడాది సంచలన విజయం సాధించింది. ఈ చిత్రాన్ని బాలీవుడ్ లో రీమేక్ చేయడం పై బేబీ సినిమా దర్శకుడు పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. 

Advertisement

జులై 14, 2023న బేబీ మూవీని మాస్ మూవీ మేకర్స్ పై ఎస్.కే. ఎన్ నిర్మించగా సాయి రాజేష్ ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించాడు. యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటివరకు రూ.90 కోట్ల కలెక్షన్లు రాబట్టి అందరినీ ఆశ్చర్యానికీ గురి చేసింది. ఇటీవలే ఓటీటీలో కూడా విడుదలైన ఈ బేబీ మూవీ డిజిటల్ మీడియంలో మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. ఇక బేబీ మూవీని పలు బాలీవుడ్ నిర్మాతలు హిందీలో రీమేక్ చేయాలని.. ప్రయత్నాలు చేస్తున్నట్టు.. గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. 

Advertisement

దర్శకుడు సాయి రాజేష్ ఈ విషయంపై ఓ షార్ట్ వీడియోలో క్లారిటీ ఇచ్చేశాడు. బేబీ మూవీని బాలీవుడ్ లో చూస్తే.. మీరే డైరెక్ట్ చేస్తారా అనే ప్రశ్నకు సమాధానంగా ఆయన కచ్చితంగా చేస్తాను. చేయాలనే ఆలోచన కూడా తనకు ఉన్నట్టు తెలిపారు. బాలీవుడ్ లో బేబీ సినిమా చేస్తే మాత్రం వేరే రకంగా చేస్తాను అంటూ క్లారిటీగా చెప్పుకొచ్చాడు. బేబీ మూవీకి తాను దర్శకుడిగా కేవలం 60 శాతం మాత్రమే హ్యాపీగా ఉన్నాడని తెలిపారు. మరికొన్ని రోజులు సమయం కనుక ఉండి ఉంటే.. బేబీ సినిమా ఇంకా బాగా తీసేవాడినని ఆయన అభిప్రాయపడ్డారు. దీనిని బట్టి చూస్తే.. బేబీ మూవీ త్వరలోనే బాలీవుడ్ లో కూడా రాబోతుందని తెలుస్తోంది. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

మరో రీమేక్ మూవీకి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ?

Mahesh Babu: మహేష్ బాబు డ్యూయల్ రోల్ లో నటించిన ఏకైక సినిమా ఏదో తెలుసా?

 

Visitors Are Also Reading