Home » మరో రీమేక్ మూవీకి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ?

మరో రీమేక్ మూవీకి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ?

by Anji
Ad

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన ఇటీవలే ఓ రీమేక్ మూవీతో బ్రో మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్లను మాత్రం వసూలు చేయలేకపోయింది. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ తాజాగా మరో తమిళ సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ న్యూస్ కి సంబంధించి అఫిషియల్ గా ప్రకటించనున్నారట. 

Advertisement

వివరాల్లోకి వెళ్లితే.. కెరీర్ బిగినింగ్ నుంచి రీమేక్ సినిమాలతో ప్రేక్షకుల పై దండయాత్ర చేస్తున్నారు పవన్ కళ్యాణ్. పాలిటిక్స్ పలు కార్యక్రమాలతో పుల్ బిజీగా ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ సినిమాలు చేయడమే ఎక్కువ. చేసిన సినిమానే మహా ప్రసాదం అనుకొని ఆయన సినిమాని నెత్తిన పెట్టుకుని చూస్తున్నారు అభిమానులు. చాలా తక్కువ మంది హీరోలకు దొరికే రకమైన అభిమానాన్ని, అభిమానులను గర్వపడేవిధంగా చేసే బాధ్యత పవన్ కళ్యాణ్ పై ఎంతైనా ఉంది. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఆయన అభిమానుల గురించి కనీసం కూడా ఆలోచించడం కూడా లేదని ఆయన చేస్తున్న సినిమాలు చూస్తే తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ను రీమేక్ సినిమాలు చేయవద్దని.. పవన్ కళ్యాణ్ అభిమానుల నుంచి చాలా రోజులుగా వేడుకుంటూనే ఉన్నారు. కానీ పవన్ వైఖరీలో మాత్రం మార్పు రావడం లేదు. 

Advertisement

పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి కమ్ బ్యాక్ ఇచ్చిన తరువాత నుంచి ఇప్పటివరకు ఆయన చేసినవన్నీ రీమేక్ సినిమాలే కావడం విశేషం. ఈ సినిమాల ఓపెనింగ్ డే కలెక్షన్లను పక్కన పెడితే.. ఎప్పటివరకు ఓ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సరిగ్గా ఆడలేదు. ప్రేక్షకులు ఇంతగా పవన్ చేస్తున్న రీమేక్ సినిమాలను రిజెక్ట్ చేస్తున్న కూడా పవన్ కళ్యాణ్ మాత్రం లేటెస్ట్ గా మరో రీమేక్ సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు. తమిళంలో సూపర్ హిట్ సాధించిన విక్రమ్ వేద మూవీని రవితేజతో కలిసి పవన్ కళ్యాణ్ రీమేక్ చేసేందుకు సిద్ధం అవుతున్నట్టు సమాచారం. ఏజెంట్ సినిమాతో ఇటీవలే భారీ ఫ్లాప్ ని ఖాతాలో వేసుకున్నా సురేందర్ రెడ్డి దర్శకత్వం చేయనున్నాడట. ప్రస్తుతం డిస్కషన్ లో ఈ ప్రాజెక్ట్ గురించి త్వరలోనే అఫీషియల్ ప్రకటన రానున్నట్టు తెలుస్తోంది. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

విజయ్కి మిడ్ నైట్ వీడియో కాల్ చేసిన సమంత.. ఏమైంది?

Mahesh Babu: మహేష్ బాబు డ్యూయల్ రోల్ లో నటించిన ఏకైక సినిమా ఏదో తెలుసా?

Visitors Are Also Reading