Home » చిరంజీవి ఆస్తులు ఎన్ని కోట్లు తెలిస్తే ఆశ్చర్యపోతారు…!

చిరంజీవి ఆస్తులు ఎన్ని కోట్లు తెలిస్తే ఆశ్చర్యపోతారు…!

by Bunty
Ad

 

 

 

మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి స్టార్ హీరోగా ఎదిగారు. అంతేకాకుండా తన కుటుంబంలో నుంచి ఎంతో మందిని స్టార్ హీరోలుగా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. చిరంజీవి తక్కువ వయసు నుంచే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇతని నటనకు గాను ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఇతనికి కోట్లాది సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ఇక చిరంజీవి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పనవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా అభిమాన సంఘాలు చిరంజీవికి ఉన్నాయి.

Advertisement

అతి చిన్న వయసు నుంచి ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి ఇప్పటివరకు దాదాపు 150 కి పైగా చిత్రాల్లో నటించాడు. ఈ క్రమంలోనే చిరంజీవి కార్లకు, ఆస్తులకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చిరంజీవి వద్ద అత్యంత ఖరీదైన కార్లు, భవనాలు ఉన్నట్లు సమాచారం అందుతుంది. ఈ క్రమంలోనే చిరంజీవి వద్ద రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారు ఉంది. దీని ఖరీదు దాదాపు 8 కోట్లకు పైనే ఉంటుంది. ఈ కారుని చిరంజీవి బర్త్డే సందర్భంగా రామ్ చరణ్ గిఫ్ట్ గా ఇచ్చాడట. దీనితో పాటు టయోటా, రేంజ్ రోవర్ కార్లు కూడా చిరంజీవి గ్యారేజీ లో ఉన్నాయి.

Advertisement

అంతేకాకుండా చిరంజీవి వద్ద జర్మనీ, బ్రిటన్ వంటి బ్రాండ్ కార్లను చిరంజీవి తన గ్యారేజీలో పొందుపరచుకున్నారు. ఇక అంతేకాకుండా చిరంజీవి వద్ద అత్యంత ఖరీదైన ఒక ప్రైవేట్ జెట్ కూడా ఉండడం విశేషం. ఇక చిరంజీవికి హైదరాబాదులో అత్యంత విలాసవంతమైన, అత్యాధునిక సౌకర్యాలతో కూడిన విల్లా కూడా ఉంది. దీని ఖరీదు దాదాపు 30 కోట్లకు పైనే ఉంటుందట. అంతేకాకుండా పలు చోట్ల ఆస్తులు కూడా ఉన్నాయి. ఇక చిరంజీవి 1985లో నాగబాబుతో కలిసి అంజన ప్రొడక్షన్ హౌస్ ని స్థాపించారు. ఈ ప్రొడక్షన్ హౌస్ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మొదటి స్థానంలో నిలిచింది. ఇక మొత్తంగా చూసుకుంటే చిరంజీవి ఆస్తుల విలువ సుమారు 16 కోట్లకు పైనే ఉంటుందని సమాచారం అందుతుంది.

ఇవి కూడా చదవండి 

King of Kotha : “కింగ్ ఆఫ్ కొత్త” సినిమా రివ్యూ…దుల్కర్ సల్మాన్ ఖాతాలో మరో హిట్

అక్కినేని అమల వల్ల నరకం అనుభవించా…. హీరోయిన్ సమంత కామెంట్స్ ?

చంద్రయాన్-3 సక్సెస్.. భారత్‌దే ప్రపంచకప్!

Visitors Are Also Reading