Home » ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు.. అల్లు అర్జున్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..!

ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు.. అల్లు అర్జున్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..!

by Anji

సాధారణంగా చాలా మంది హీరోలు సినిమాలు తీస్తుంటారు. కానీ అందులో కొంత మంది మాత్రమే మంచి సక్సెస్ ను సాధిస్తుంటారు. కొంత మంది సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయినప్పటికీ ఆ సినిమాలకు అవార్డులు అంతగా రావు. అవార్డులు రావాలంటే ముఖ్యంగా ఆ సినిమాలో  చేసిన పాత్రలో లీనమైపోవాలి. అలా లీనమైపోయే వారు చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు. అలా అని అన్ని సినిమాలకు అవార్డులు రావు. కొన్ని సినిమాలు కలెక్షన్ల పరంగా అంతగా వసూలు సాధించకపోయినప్పటికీ అందులో నటించినందుకు అవార్డులు లభిస్తాయి. మరికొన్ని సినిమాలు చూడటానికి చాలా బాగుంటాయి. అయినప్పటికీ అవార్డులు వరిస్తే వారికి ఇక పండుగ వాతావరణం అనే చెప్పాలి.

జాతీయ అవార్డును ముద్దాడాలన్నది ఎందరో కల. కానీ కొందరే దాన్ని నెరవేర్చుకోగలరు. 68 ఏళ్లుగా జాతీయ సినీ అవార్డుల పురస్కారం జరుగుతోంది. కానీ ఇంతవరకు ఉత్తమ నటుడి కేటగిరీలో ఒక్కటంటే ఒక్కటి కూడా తెలుగు హీరోకు దక్కలేదు. అది అందని ద్రాక్షగానే మిగిలిపోతుందా అన్న భయాలను అల్లు అర్జున్ పటాపంచాలు చేశాడు. ఎవ్వరైనా రానీ.. ఎవ్వరైనా ఉండనీ.. నీయవ్వ తగ్గేదేలే అంటూ బన్నీ ఎందరో స్టార్స్ ను వెనక్కు నెట్టి ఉత్తమ నటుడు అవార్డు కైవసం చేసుకున్నాడు.

 

pushpa the rule
దీంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అటు బన్నీ కూడా అవార్డు తనకు ప్రకటించగానే షాప్ లో ఉండిపోయాడట! ఎవరైనా ప్రశంసించేందుకు ప్రయత్నిస్తున్నా.. నేనింకా షాక్ లో ఉన్నా.. నమ్మలేకపోతున్నాను అని ఆశ్చర్యం వ్యక్తం చేశాడట. మా ఐకాన్ స్టార్ తలచుకుంటే అసాధ్యం కూడా సుసాధ్యం అవుతుందంటున్నారు అభిమానులు. ఇకపోతే ఉత్తమ నటిగా ఆలియా భట్, కృతి సనన్, ఉత్తమ సహాయ నతుడిగా పంకజ్ త్రిపాఠి, ఉత్తమ సహాయ నటిగా పల్లవి జోషి, ఉత్తమ దర్శకుడిగా నిఖిల్ మహాజన్ అవార్డులు అందుకున్నారు.

Visitors Are Also Reading