Home » ఎన్టీఆర్, రామ్ చరణ్ కి నేషనల్ అవార్డు రాకపోవడానికి కారణం ఇదేనా ?

ఎన్టీఆర్, రామ్ చరణ్ కి నేషనల్ అవార్డు రాకపోవడానికి కారణం ఇదేనా ?

by Anji
Published: Last Updated on
Ad

నేషనల్ అవార్డులను తాజాగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే పుష్ప సినిమాలో నటనకు గాను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని బెస్ట్ యాక్టర్ గా అవార్డు సొంతం చేసుకున్నాడు. ఈ కేటగిరిలో సౌత్ నుంచి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఎన్టీఆర్, సూర్య నామినేట్ కాగా, అల్లు అర్జున్ ను అవార్డు వరించింది.

Advertisement

దీంతో తెలుగు హీరోల్లో బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు అందుకున్న మొదటి హీరోగా సరికొత్త రికార్డు ను సృష్టించాడు. ఇదిలా ఉండగా బెస్ట్ యాక్టర్ గా అల్లు అర్జున్ ని సెలెక్ట్ చేయడంపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.

RRR సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ యాక్టింగ్ తో పోలిస్తే పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ఏమంత గొప్పగా యాక్ట్ చేయలేదని కామెంట్స్ చేస్తున్నారు  కొంత మంది ఆడియన్స్. పుష్ప సినిమాలో బిగినింగ్ టు ది ఎండ్ అల్లు అర్జున్ ఒకే స్టైల్ లో యాక్టింగ్ ఉంటుందని, పెద్దగా వేరియేషన్స్ కూడా ఉండవని అంటున్నారు .RRR సినిమాలో ఎన్టీఆర్ యాక్షన్, ఇన్నో సెన్స్ ఇలా అన్ని రకాల వేరియేషన్స్ చూపించారని.. అల్లు అర్జున్ కంటే ఆర్ఆర్ఆర్ మూవీలో ఎన్టీఆర్ కి బెస్ట్ యాక్టర్ గా ఇవ్వాల్సి ఉందన్నారు. అయితే ఆర్ఆర్ఆర్ మూవీలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరిలో ఒకరికైనా బెస్ట్ యాక్టర్ అవార్డు రావాల్సిందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Advertisement

pushpa

ఈ క్రమంలో RRR సినిమాకు ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు బెస్ట్ యాక్టర్ అవార్డు వస్తుందని భావించి నిరాశకు గురైన ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ కి నేషనల్ అవార్డు రూపంలో మరోసారి నిరాశ ఎదురయింది. ఏది ఏమైనా ఈ ఏడాది నేషనల్ అవార్డ్స్ లో తెలుగు సినిమాల డామినేషన్ పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఇప్పటికే వరుస పాన్ ఇండియా హిట్స్ తో RRR సినిమాతో ఆస్కార్  స్థాయికి ఎదిగిన టాలీవుడ్ కి ఈ నేషనల్ అవార్డ్స్ మరింత బూస్టప్ ఇస్తుందనే చెప్పాలి.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌.. సత్తా చాటిన ఆర్ఆర్ఆర్.. అవార్డులు పొందిన నటులు వీళ్లే..!

యాంకర్ వర్షిణి ఎవరితో ప్రేమలో ఉందో తెలుసా ? ఇన్నాళ్లకు వెలుగులోకి..!

Visitors Are Also Reading