Home » King of Kotha : “కింగ్ ఆఫ్ కొత్త” సినిమా రివ్యూ…దుల్కర్ సల్మాన్ ఖాతాలో మరో హిట్

King of Kotha : “కింగ్ ఆఫ్ కొత్త” సినిమా రివ్యూ…దుల్కర్ సల్మాన్ ఖాతాలో మరో హిట్

by Bunty
Ad

పాన్ ఇండియా సూపర్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమిళ్ లోనే కాకుండా అటు బాలీవుడ్ ఇటు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో దుల్కర్ సల్మాన్. అయితే దుల్కర్ సల్మాన్ కాంపౌండ్ నుంచి వస్తున్న లేటెస్ట్ మూవీ కింగ్ ఆఫ్ కొత్త. కోలీవుడ్ భామ ఐశ్వర్య లక్ష్మి ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. గ్యాంగ్ స్టార్ డ్రామా నేపథ్యంలో దొరికిన ఈ సినిమా ఇవాళ చాలా గ్రాండ్ గా రిలీజ్ చేశారు. మరి ఈ సినిమా స్టోరీ ఎలా ఉంది… రివ్యూ రేటింగ్ ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

కథ మరియు వివరణ

పాన్ ఇండియా సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన కింగ్ ఆఫ్ కొత్త సినిమా స్టోరీ విషయానికి వస్తే.. ఈ సినిమా మొత్తం 1980 సంవత్సరం కాలంలో నడుస్తూ ఉంటుంది. రాజు పాత్రలో దుల్కర్ సల్మాన్ కనిపించాడు. అయితే హీరో దుల్కర్ సల్మాన్ ఈ సినిమాలో ఒక ఫుట్ బాల్ ప్లేయర్. కానీ అనుకోని కారణాలవల్ల కొన్ని సమస్యలలో పడి… వాటిని పరిష్కరించాలి అనే ప్రయత్నంలో ఆ ఊరిని ఏలే నాయకుడిగా మారిపోతాడు హీరో దుల్కర్ సల్మాన్. అసలు ఒక ఫుట్ బాల్ ప్లేయర్ అయిన రాజు ఇలా మారిపోవడానికి కారణం ఏంటి ? అలాగే రాజు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి ? అసలు ఫుట్ బాల్ ప్లేయర్ రాజు నాయకుడు ఎలా అయ్యాడు అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

Advertisement

ఈ సినిమా మొదటి భాగం చాలా అద్భుతంగా తీశారు. మొదటి సగభాగం ఇంట్రెస్ట్ గా వెళ్తున్నప్పటికీ పాటలు కథకి అడ్డుకట్ట వేస్తాయి. మలయాళం ఫ్లేవర్ కొంచెం కనిపించిన… దుల్కర్ స్క్రీన్ ప్రజెంట్ వల్ల మనకి ఇక్కడ బోర్ కొట్టదు. ఇక రెండవ భాగం మొదలైనప్పటి నుంచి సీరియస్ మూడ్లోకి సినిమా వెళ్తుంది. ఇక రెండు గ్రూపుల మధ్య గొడవ అనేది మామూలుగానే అనిపించిన… దుల్కర్ సల్మాన్ మరియు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఓవరాల్ గా సెకండ్ హాఫ్ కాస్త.. సినిమాపై ఇంట్రెస్ట్ ను పోగొడుతుంది.

ప్లస్ పాయింట్స్

హీరో దుల్కర్ సల్మాన్
బ్యాగ్రౌండ్ మ్యూజిక్
యాక్షన్ సీన్స్

మైనస్ పాయింట్స్

రొటీన్ స్టోరీ
సెకండాఫ్

రివ్యూ రేటింగ్ :2.75/5

ఇవి కూడా చదవండి 

అక్కినేని అమల వల్ల నరకం అనుభవించా…. హీరోయిన్ సమంత కామెంట్స్ ?

చంద్రయాన్-3 సక్సెస్.. భారత్‌దే ప్రపంచకప్!

Virat Kohli : వరల్డ్ కప్ లో విరాట్ కోహ్లీ బౌలింగ్ …?

Visitors Are Also Reading