Home » ఆమె లేకపోతే రాజమౌళి ఇండస్ట్రీలోకి వచ్చేవాడే కాదు.. మరో అమ్మ అంటూ..!

ఆమె లేకపోతే రాజమౌళి ఇండస్ట్రీలోకి వచ్చేవాడే కాదు.. మరో అమ్మ అంటూ..!

by Anji
Ad

దర్శక ధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ముఖ్యంగా పదేళ్ల కిందట కేవలం తెలుగు ప్రేక్షకులకు మాత్రమే సుపరిచితమైన రాజమౌళి ప్రస్తుతం పాన్ వరల్డ్ డైరెక్టర్ గా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నారు.

Advertisement

ప్రభాస్ తో తీసిన బాహుబలి, ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో తెరకెక్కించిన RRR సినిమాలు రాజమౌళికి క్రేజ్ ని అమాంతం పెంచేశాయి. అయితే రాజమౌళి సినిమాల్లోకి ఏవిధంగా వచ్చారు ? ఆయన సక్సెస్ కి కారణం ఎవరు ? అనే ప్రశ్నలకు సమాధానాలు చాలా మంది అభిమానులకు అస్సలు తెలియవు. 

తాజాగా రాజమౌళి స్వయంగా ఈ ప్రశ్నలకు సమాధానాలు వెల్లడించారు. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. రాజమౌళి తెరకెక్కించిన RRR మూవీ కమర్షియల్ గా సక్సెస్ ని సొంతం చేసుకోవడంతో ఈ సినిమాకి ఊహించని స్థాయిలో అవార్డులను అందుకున్నారు. ఈ అవార్డులు జక్కన్న స్థాయిని పెంచడంతో పాటు ఎంత గొప్ప దర్శకుడు అనే విషయం తెలియని వాళ్లకు సైతం తెలియడానికి కారణమవుతున్నాయి. తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమాకి బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ పిక్చర్ కేటగిరిలో క్రిటిక్స్ ఛాయిస్ అవార్డు లభించింది.

Advertisement

ఈ అవార్డును అందుకున్న రాజమౌళి మాట్లాడుతూ.. మా అమ్మ పేరు రాజనేంద్రి అని.. నాలో ఉన్నటువంటి టాలెంట్ ను గుర్తించి నేను సినిమా రంగం వైపు వచ్చేలా చేసిన వ్యక్తి ఆమెనని రాజమౌళి చెప్పుకొచ్చారు. మా వదిన శ్రీవల్లి నన్ను ఎప్పుడూ ప్రోత్సహిస్తుంటుందని జక్కన్న కామెంట్స్ చేయడం గమనార్హం. శ్రీవల్లి నాకు మరో అమ్మ అని.. రాజమౌళి పేర్కొన్నారు. నా భార్య రమా రాజమౌళి నా సినిమాలకు ఫ్యాషన్ డిజైనర్ గా పని చేస్తుందని.. అందరికీ తెలిసిన విషయమే. అయితే నిజ జీవితంలో కూడా నా డిజైనర్ రమ అని కామెంట్స్ చేశారు రాజమౌళి. నా కూతుళ్లు నా కోసం ఏం చేయకపోయినా వాళ్ల నవ్వు నాకు చాలని రాజమౌళి తెలిపారు. ఇక ఆ తరువాత దేశం గురించి మాట్లాడుతూ… మేరా భారత్ మహాన్ జై హిందూ అంటూ రాజమౌళి చేసిన కామెంట్స్ పై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

ఢీ’ సినిమాకు ముందు అనుకున్నది విష్ణుని కాదా? ఆ సినిమా మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా?

బాలయ్య కంటే చిరంజీవికి ఎక్కువగా మార్కెట్ ఉండటానికి కారణం ఏంటో తెలుసా ? 

Visitors Are Also Reading