Home » బాలయ్య కంటే చిరంజీవికి ఎక్కువగా మార్కెట్ ఉండటానికి కారణం ఏంటో తెలుసా ? 

బాలయ్య కంటే చిరంజీవికి ఎక్కువగా మార్కెట్ ఉండటానికి కారణం ఏంటో తెలుసా ? 

by Anji
Published: Last Updated on
Ad

సినీ ఇండస్ట్రీలో సీనియర్ హీరోలు అయినటువంటి చిరంజీవి, బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవరమే లేదు. వీరికి ఊహించని స్థాయిలో అభిమానులున్నారు. యంగ్ జనరేషన్ ఆడియన్స్ కూడా చాలా మంది చిరంజీవి, బాలయ్య లను ఎంతగానో అభిమానిస్తారనే విషయం తెలిసిందే.

chiru-ntr-balakrishna

chiru-ntr-balakrishna

గత కొద్ది సంవత్సరాలుగా చిరంజీవి మార్కెట్ అంతకంతకూ పెరుగుతుండగా.. బాలయ్య మార్కెట్ కూడా పెరిగినప్పటికీ చిరంజీవి స్థాయిలో మాత్రం పెరగలేదనే చెప్పాలి. ప్రధానంగా బాలయ్య కంటే కూడా చిరంజీవికి మార్కెట్ ఎక్కువగా ఉండడానికి కారణం ఏంటనే ప్రశ్నకు వేర్వేరు సమాధానాలు వినిపిస్తున్నాయి. 

Advertisement

  చిరంజీవి అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే కథాంశాలపై ఎక్కువగా ఉండడానికి కారణం ఏంటనే ప్రశ్నకు వేర్వేరు సమాధానాలు వినిపిస్తున్నాయి. చిరంజీవి అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే కథాంశాలపై ఎక్కువగా దృష్టి పెట్టగా.. బాలయ్య ఎక్కువగా మాస్ సినిమాలపై దృష్టి సారించడం ఆయన ఒకవిధంగా మైనస్ అయింది. బీ, సీ సెంటర్లోల బాలయ్య మూవీస్ ఆడిన రేంజ్ లో ఏ సెంటర్లలో బాలయ్య సినిమా ఆడటం లేదు. మరోవైపు కమర్షియల్ గా సక్సెస్ సాధించిన సినిమాలు తక్కువగా ఉండటం, వరుస విజయాలను సొంతం చేసుకునే విషయంలో బాలయ్య ఫెయిల్ కావడం కూడా సినీ కెరీర్ పై ప్రభావం పడింది.

Advertisement

సరైన సమయంలో సినిమాలను విడుదల చేయకపోవడం.. విడుదల తేదీ విషయంలో పొరపాట్లు కూడా బాలయ్యకి మైనస్ అవుతున్నాయి. మరోవైపు ఇతర భాషలపై కూడా బాలయ్య దృష్టి పెట్టకపోవడం ఆయన సినిమాలపై ఎఫెక్ట్ పడుతోంది. ఈ పొరపాట్లను కనుక బాలయ్య సరిదిద్దుకుంటే ఏ మాత్రం బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టించడానికి ఎక్కువ సమయం పట్టదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కొన్ని విషయాల్లో ఇప్పటికే మారగా.. మరికొన్ని విషయాల్లో ఇంకా మారాల్సి ఉంది. రాబోయే రోజుల్లో బాలయ్య, చిరంజీవి మధ్య పోటీ ఎలా ఉండబోతుందో వేచి చూడాలి మరీ. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

చిరంజీవి-సురేఖ పెళ్లి పత్రికలో వీరి పేర్లను మీరు గమనించారా ?

Ada Sharma: నాకు అలాంటి అబ్బాయే కావాలి” అంటూ క్లారిటీ ఇచ్చేసిన ఆదా శర్మ!

Visitors Are Also Reading