Home » చిరంజీవి-సురేఖ పెళ్లి పత్రికలో వీరి పేర్లను మీరు గమనించారా ?

చిరంజీవి-సురేఖ పెళ్లి పత్రికలో వీరి పేర్లను మీరు గమనించారా ?

by Anji
Ad

మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి ఎంటర్ ఇచ్చి అంచలంచెలుగా ఎదుగుతూ మెగాస్టార్గా ఎదిగారు చిరంజీవి. ముఖ్యంగా చిరంజీవి ఆకలి కేకల స్థాయి నుంచి వేలాది మంది ఆకలి తీర్చే మహానుభావుడిగా మారారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పటికీ ఆయన పేరుతో మెగా ఫ్యామిలీ నుంచి ఎంతోమంది హీరోలు స్టార్ హీరోలుగా ఎదిగారు.

Advertisement

అలాంటి చిరంజీవి టాలెంట్ కు అల్లు రామలింగయ్య తన కూతురు సురేఖను ఇచ్చి పెళ్లి చేశారు. అదే సమయంలో సురేఖ చిరంజీవికి సంబంధించిన పెళ్లి పత్రిక సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇవాళ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అన్నయ్య పెళ్లి కార్డు చూసి అభిమానులు తెగ మురిసిపోతున్నారు. చిరంజీవికి మరియు సురేఖకు ఫిబ్రవరి 20 1980లో మద్రాసులో వీరి పెళ్లి జరిగింది.

Advertisement

Manam

పెళ్లి జరిగిన సమయంలో చిరంజీవి కూడా నూతన ప్రసాద్తో కలిసి తాతయ్య ప్రేమ లీలలు అనే సినిమాలో నటించారట. ఆ సినిమా షూటింగు పూర్తయినంక డైరెక్టర్ పెళ్లి మండపానికి వచ్చి సురేఖ మెడలో తాళి కట్టారట. ఈ పెళ్లి పత్రికలో సురేఖ బిఏ, చిరంజీవి బీకాం డి ఎఫ్ ఏ అని రాసి ఉంది. ఈ పత్రికను సోషల్ మీడియాలో చూసి అభిమానులు సంబరపడిపోతున్నారు. ఇటీవలే చిరంజీవి బోలా శంకర్ మూవీతో కాస్త నిరాశలో ఉన్నారు. నెక్స్ట్ తన తర్వాతి చిత్రంతో  అయినా ప్రేక్షకులను   ఆకట్టుకుంటాడో లేదో వేచి చూడాలి మరీ.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు 

మెగాస్టార్ ఆస్తుల విలువ ఎన్ని వేల కోట్లో తెలుసా ?

నేను చిరంజీవి గారిని పకోడీ గాడు అనలేదు – కొడాలి నాని

Visitors Are Also Reading