Home » కీర్తి సురేష్ జాతకం ఇంత ఘోరమా…ఏది ముట్టుకున్నా నాశనమే ?

కీర్తి సురేష్ జాతకం ఇంత ఘోరమా…ఏది ముట్టుకున్నా నాశనమే ?

by Bunty
Ad

 

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ‘నేను శైలజ’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఆ సినిమా అనంతరం సినిమాలలో నటించి మంచి విజయాలను తన ఖాతాలో వేసుకుంది. ‘మహానటి’ సినిమాతో గొప్ప గుర్తింపును దక్కించుకుంది. ఈ సినిమాకుగాను తనకు ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి. ఈ అమ్మడు టాలీవుడ్ లో దాదాపు స్టార్ హీరోలు అందరి సరసన అవకాశాలను అందుకుంది.

Advertisement

ఇక తాజాగా ఈ అమ్మడు నటించిన చిత్రం ‘బోళా శంకర్’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ ను మూటగట్టుకుంది. ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో మరో కారణంగా కీర్తి సురేష్ నిలిచింది. చిరంజీవికి చెల్లెలుగా చేయడంతోనే ఈ సినిమా ఫ్లాప్ అయిందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తే చాలావరకు సినిమాలు విజయాన్ని సొంతం చేసుకున్నాయి. కానీ ఈ మధ్యకాలంలో ఈ అమ్మడు హీరోలకు చెల్లెలి పాత్రలో కూడా నటిస్తోంది. కానీ ఆ సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి.

Advertisement

ఈమధ్య కాలంలో రజనీకాంత్ నటించిన అన్నాత్తే సినిమాలో రజనీకాంత్ కు చెల్లెలుగా కీర్తి సురేష్ నటించింది. ఈ సినిమా రజనీకాంత్ కు ఘోరమైన ఫ్లాప్ ని ఇచ్చింది. దీంతో కీర్తి సురేష్ చెల్లెలుగా నటిస్తే ఏ సినిమా అయినా ఫ్లాప్ అవుతుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అలా ఇద్దరు స్టార్ హీరోలకు చెల్లెలుగా నటించిన కీర్తి సురేష్ భారీ ఫ్లాప్స్ ని మూట కట్టుకుంది. దీంతో కొందరు నెటిజన్స్ కీర్తి సురేష్ చెల్లెలుగా నటిస్తే స్టార్ హీరోలకు అసలు కలిసి రాదని అంటున్నారు. ఇందులో కీర్తి తప్పేమీ లేకపోయినప్పటికీ.. ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ చాలా ఎక్కువ. దీంతో కీర్తి సురేష్ చెల్లెలుగా చేస్తే ఏ హీరో సినిమా అయినా సరే ప్లాప్ అవుతుందని ఓ ముద్ర పడిపోయింది.

ఇవి కూడా చదవండి 

అన్నగారికి చంద్రబాబు నిజంగానే వెన్నుపోటు పొడిచాడా ? ఎన్టీఆర్ కామెంట్స్ వైరల్

Samantha : అమెరికాలో కోట్లు పెట్టి ఇల్లు కొన్న హీరోయిన్ సమంత ?

దివ్యభారతి చనిపోయి ఇంత మంది హీరోయిన్లకు లైఫ్ ఇచ్చిందా…?

Visitors Are Also Reading